ఆఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్ల ప్రభుత్వం కొనసాగుతుంది. అమెరికా కూడా పూర్తిగా ఆఫ్ఘన్ ను విడిచి వెళ్ళిపోయింది. దీనితో తాలిబన్లకు తిరుగులేకుండా పోయింది. దీనితో ఆఫ్ఘన్ ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహిళలు తమకి ఎలాంటి చట్టాలని అమలు చేస్తారో అంటూ సతమతం అవుతున్నారు. ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ రాజ్యం ఏర్పాటు కాబోతోంది.
ఆఫ్ఘన్ లో ఏర్పాటు కాబోతున్న కొత్త ప్రభుత్వానికి తాలిబన్ అగ్రనేత హీబాతుల్లా అఖుంద్జాదా నాయకత్వం వహించనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఎవరెవరు ఉండబోతున్నారో కూడా తాలిబన్ హైకమాండ్ ఫిక్స్ చేసింది. ఈ సమయంలో తాలిబన్ ప్రభుత్వం ఎలా ఉండబోతోంది, ఎలాంటి విధివిధానాలు ఉండబోతున్నాయ్, మహిళలకు ప్రాధాన్యత ఉంటుందా, మహిళల మనసులు గెలుచుకునేలా విధానాలు ఉంటాయా, ఎలాంటి మోడల్ ను తాలిబన్స్ ప్రపంచం ముందు ఉంచబోతున్నారు, ఆఫ్ఘన్లను ఆకట్టుకోవడానికి ఏం చేయబోతున్నారు, వీటిపైనే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఒకట్రెండు రోజుల్లోనే న్యూ గవర్నమెంట్ బ్లూప్రింట్ తో ప్రపంచం ముందుకు రాబోతున్నారు తాలిబన్స్. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరుతో విధానాలను ప్రకటించనున్నారు. అయితే, తాలిబన్ల పేరు చెబితేచాలు నిలువెల్లా వణికిపోయే ఆఫ్ఘన్ మహిళల్లో భయాందోళనలను పోగొట్టేవిధంగా విధివిధానాలు ఉంటాయో లేదో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచం మొత్తం తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని తాలిబన్లు ఆశిస్తున్నారు. అందుకే, అంతర్జాతీయ ఆమోదం లభించే నేత కోసం అన్వేషిస్తున్నారు. ఆఫ్ఘన్ లో ఏర్పాటు కాబోతున్న కొత్త ప్రభుత్వానికి తాలిబన్ అగ్రనేత హీబాతుల్లా అఖుంద్జాదా నాయకత్వం వహించినా, అతని అండర్ లో ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్ పనిచేసేలా కీలక పోస్టును క్రియేట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ వార్తా సంస్థ టోలో న్యూస్ నివేదిక ప్రకారం, తాలిబాన్ ఆఫ్ఘన్ నాయకుల మధ్య చర్చలు పూర్తయిన తర్వాత కాబూల్ కొత్త ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రకటించబోతోంది. తాలిబాన్ నాయకుడు హెబతుల్లా అఖుంద్జాదా కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని, ఒక ప్రధాని లేదా అధ్యక్షుడు తాలిబాన్ నాయకుడి కింద పనిచేసే అవకాశం ఉందని వెల్లడించింది. కాబూల్ విమానాశ్రయం నుండి యుఎస్ దళాలు బయలుదేరిన ఒక రోజు తర్వాత, ఖతారీ సాంకేతిక నిపుణుల బృందం విమానాశ్రయ కార్యకలాపాల పునఃప్రారంభం గురించి చర్చించడానికి రాజధానిలో అడుగుపెట్టింది.
తాలిబాన్ నేతగా బయట అందరికీ తెలిసిన, అఖుండ్ జాదా ముగ్గురు డిప్యూటీల్లో ఒకరైన ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాల ఇన్చార్జిగా వుంటారని తెలుస్తోంది. అందరినీ కలుపుకుని పోయేలా ఆఫ్ఘన్ ప్రభుత్వ ఏర్పాటుపై సంప్రదింపులు అధికారికంగా ముగిశాయని కరిమి చెప్పారు. పూర్వపు ప్రభుత్వంలోని నేతలు, ఇతర కీలక నేతలతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. వారందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు.