తాలిబన్ల ఆరాచకం ఎంత ఎక్కువైందంటే?

Update: 2021-08-23 02:08 GMT
ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తాలిబన్లు. నాగరిక సమాజం అనుక్షణం సిగ్గు పడేలా వారి తీరు ఉంటుంది. ప్రాణానికి వారిచ్చే విలువ.. ఆడవారిని వారెంత చులకనగా చూస్తారన్న విషయం అందరికి తెలిసిందే. వారం క్రితం అప్గాన్ ను తమ సొంతం చేసుకున్న వారి తీరు.. ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

తాము మారిపోయామన్న వారి మాటలకు.. చేతలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో వారి పనులు ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది. వారు చేసే ఆరాచకాలు రోజుకు పదుల చొప్పున బయటకు వస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఉదంతాల్ని చూస్తే.. మరీ ఇంత దారుణమా? అనుకోకుండా ఉండలేం. తాజాగా బయటకొచ్చిన ఆరాచక ఉదంతాన్ని చూస్తే.. వారి రాక్షసత్వం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.

 అఫ్గాన్లు అందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లుగా చెప్పిన తాలిబన్లు.. చేతుల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో పని చేసి.. తమపై పోరాడిన వారి విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. వారి ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు. లొంగిపోతున్నా పట్టించుకోకుండా.. దారుణ శిక్షల్ని వేస్తున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్సులోని బాద్గీన్ నగర పోలీస్ చీఫ్ హజీముల్లా అచక్ జాయ్ తాలిబన్లకు లొంగిపోయారు.

అనంతరం ఆయన కళ్లకు గంతలు కట్టి.. మోకాళ్లపై కూర్చోబెట్టిన తాలిబన్లు.. పలు రౌండ్లు కాల్పులు జరిపి చంపేశారు. వారి క్షమాభిక్ష ఏ స్థాయిలో ఉంటుందన్న విషయాన్ని ప్రాశ్చాత్య మీడియా వెల్లడించింది.అంతేకాదు.. అచక్ జాయ్ పై తాలిబన్లు తూటాలు కురిపించిన వైనానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారి.. తాలిబన్ల రాక్షసత్వం ఎంతలా ఉంటుందో తెలియజేస్తోంది.
Tags:    

Similar News