ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు కూడా వేడి వేడిగా జరుగుతున్నాయి. టీడీపీ నేతల నినాదాలతో సభ మారుమోగిపోతుంది. టీడీపీ నేతలు సభలో సమన్వయం పాటించాలని స్పీకర్ తమ్మినేని - వైసీపీ నేతలు ఎంత చెప్తున్నప్పటికీ కూడా టీడీపీ నేతలు మాత్రం వారి మాట్లాని పేడ చెవిన పెట్టి ..సభ సజావుగా జరగకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టుతున్నారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం కాగానే - రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభమైంది. అయితే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు.
జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ - స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు. వెల్ లోకి వచ్చి ఆందోళన చేయవద్దని - సంయనమనం పాటించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా - టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. దీంతో స్పీకర్ తన స్థానం నుంచి లేచి నుంచొని వాటీజ్ దిస్ అంటూ టీడీపీ శాసనసభ్యుల పై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పీకర్ పై దాడికి యత్నించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర మనస్తాపం చెందారు. సభలో ఎవరు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారో జనం గమనిస్తున్నారని ఇది మీ ఇళ్లా.. లేక అసెంబ్లీనా అని స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యుల తీరుతో ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే ఎటువంటి చర్యలకైనా సిద్ధమని హెచ్చరించారు. అలాగే సభలో టీడీపీ నేతల వ్యవహార శైలి పై సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.