వచ్చే ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన నందమూరి కుటుంబం వారసుడు, సినీ నటుడు నందమూరి తారకరత్న.. తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాజాగా ఆయన పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చించారు. అయి తే.. ప్రధానంగా ఇరువురి మధ్య కీలకమైన సీటు విషయం చర్చకు వచ్చినట్టు తెలిసింది.
అదే.. కీలకమైన గుడివాడ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలని భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా చూచాయగా.. తారకరత్న సంకేతాలు ఇస్తున్నారు. అయితే..దీనిపై ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం ఎలాంటి స్పందనా లేకుండా మౌనంగా ఉంది. ఎందుకంటే.. గుడివాడలో బలమైన కొడాలి నానిని ఎదిరించాలనేది వ్యూహం ఉన్నప్పటికీ.. అంతకన్నా బలమైన నాయకుడు అవసరం.
ఈ క్రమంలో ఇప్పటికి ఒక ఎన్నారై సహా... మరో నేత రంగంలో ఉన్నారని తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు కొడాలిని ఎదిరించే సత్తా ఉన్న నాయకుడు టీడీపీకి అవసరం ఉంది. ఈ క్రమంలో ఎన్నారై(ప్రస్తుతం ప్రచారంలో ఉంది)కి కన్ఫర్మ్ చేస్తారనే వాదన వినిపిస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ, ఇప్పుడు తారకరత్న కూడా ఇదే స్థానం కోరుతున్నారు.
దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి తాత(ఎన్టీఆర్) పుట్టిన జిల్లా కావడంతోపాటు.. నందమూరి వంశస్థులు ఎవరూ కూడా ఇప్పటి వరకు ఎన్టీఆర్ తర్వాత ఇక్కడ పోటీ చేయలేదు. అదేసమయంలో యువ నాయకుడు.. ఈ రెండు కారణాలతో తనకు ఇక్కడ గెలిచేందుకు అవకాశం ఉంటుందని తారక్ అంచనాలు గా ఉన్నాయి.
అదేసమయంలో తారకరత్న బరిలో దిగితే.. జూనియర్ కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుడివాడపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.