ఎవరైనా మోసపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. మరి పోలీసులే మోసపోతే ఏమి చేస్తారు ? అందులోను సీనియర్ పోలీసు అధికారులనే మోసం చేస్తే..ఇక చెప్పేదేముంది ? ఇపుడీ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అందులోను ఒకరో ఇద్దరో కాదు. ఏకంగా తమిళనాడు, కర్నాటక, తెలంగాణాలో రాష్ట్రాల్లోని కనీసం 10 మంది పోలీసు అధికారుల పేరుతో ఘరానా ముఠా ఒకటి మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. దాంతో విచారణ జరిపి మోసగాళ్ళను పట్టుకోవాలని ప్రత్యేక బృందమే రంగంలోకి దిగింది.
ఇంతకీ విషయం ఏమిటంటే ఆమధ్య పేస్ బుక్ లో ఓ కర్నాటకలోని సీనియర్ ఐపిఎస్ పోలీసు అధికారి హరి శేఖరన్ పేరు, ఫొటోతో ఓ ప్రకటన వచ్చింది. తన కుటుంబంలోని పలానా వారికి అనారోగ్యంగా ఉంది కాబట్టి వైద్యం కోసం అందరు తోచినంత డబ్బులిచ్చి సాయం చేయండని. దాంతో సదరు పోలీసు అధికారిని తెలిసిన వారంతా ఎవరికీ తోచినంత డబ్బులు ఫేస్ బుక్ లో చెప్పిన అకౌంట్ లో జమచేశారు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అదంతా ఫేక్ అని. అంటే ఫేస్ బుక్ లో పోలీసు అధికారి పేరుతో వచ్చిన ప్రకటన మోసంగా తేలింది. అంతేకాకుండా అసలు ఫేస్ బుక్ ఖాతానే ఫేక్ అని బయటపడింది.
తనకు సంబంధం లేని వారెవరో తన పేరు, హోదాను ఉపయోగించుకుని ఫేస్ బుక్ లో ఓ మోసపూరితమైన ఖాతాను తెరిచి అందరి దగ్గర డబ్బులు తీసుకున్న విషయాన్ని సదరు పోలీసు అధికారి గుర్తించారు. సరే తర్వాత ఇదే విషయాన్ని సీఐడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నిపుణులు ఆ ఫిర్యాదుపై దర్యాప్తు చేశారు. సీన్ కట్ చేస్తే ఇటువంటి ఫిర్యాదు మరో వారం తర్వాత ఇంకో ఐపిఎస్ అధికారి ఎంహెచ్ నాగ్తే నుండి కూడా వచ్చింది. వారం తర్వాత సీఐడి డిఎస్పీ ప్రకాష్ రాథోడ్ నుండి ఇటువంటి ఫిర్యాదే రావటంతో కర్నాటక పోలీసులు షాక్ తిన్నారు.
ఏమి జరుగుతోందో తెలుసుకునే లోగానే తమిళనాడు, తెలంగాణాలోని పోలీసు అధికారుల పేర్లతో కూడా నకిలీ ఫేస్ బుక్ ఐడిలు, ఫొటోలతో సహా దర్శనమిచ్చిన ఘటనలు వెలుగు చూడటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇంతమంది పోలీసు ఉన్నతాధికారుల ఫొటోలు వాడుకుని, ఫేక్ ఐడిలతో ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి డబ్బులు దోచేసుకోవటం అంటే మామూలు విషయం కాదు. దాంతో సైబర్ నిపుణులతో పాటు క్రైం పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఫేస్ బుక్ ఖాతాల్లో వాడుతున్న ఐడిల ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులకు మొత్తం రాకెట్ రాజస్ధాన్ లోని భరత్ పూర్లో ఉన్నట్లు గుర్తించారు.
ఫేక్ ఐడిలతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరవటానికి మొబైల్ ఫోన్ ఆపరేటర్లు, సిమ్ కార్డుల రీటైల్ డిస్ట్రిబ్యూటర్లు సహకరించినట్లు అర్ధమైపోయింది. నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి మొబైల్ సిక్ కార్డులు కొనుగోలు చేసి ఫేస్ బుక్ ఖాతాలు ప్రారంభించి జనాల నుండి డబ్బులు గుంజేస్తున్న విషయం బయటపడింది. సిమ్ కార్డులు అమ్మిన బల్వీందర్ సింగ్, నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన సైనీ, నకిలీ ఆధార్ కార్డులకు నకిలీ సిమ్ కార్డులు అమ్మిన అన్సార్ ఖాన్, నకిలీ ఖాతాల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న సద్దాం అనే నలుగురిని అరెస్టు చేశారు. నకిలీ ఖాతాలు ఓపెన్ చేస్తున్న షకీల్ అహ్మద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తానికి ఈ గ్యాంగ్ ఎవరో కానీ ఏకంగా సీనియర్ ఐపీఎస్ అధికారులనే మోసం చేసేసింది.