టీసీఎస్​ కొత్త రికార్డు... ఆ జాబితాలో మొదటి స్థానం!

Update: 2021-12-24 00:30 GMT
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ పేరు వినని ఐటీ ఉద్యోగులు అంటూ భారతదేశంలో ఎవరు ఉండరు. ప్రతి గ్రామం నుంచి కానీ లేకపోతే కనీసం ఓ పంచాయతీ నుంచి అయినా ఈ కంపెనీలో కచ్చితంగా ఎవరో ఒకరు పని చేసి ఉంటారు. వాస్తవానికి టీసీఎస్​ లో పని చేయడం అనేది చాలా మంది ఐటీ ఉద్యోగులకు కల లాంటిది. ఇతర దేశాలతో పాటు భారత్ లో కూడా ఐటీ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న ఈ కంపెనీ కృషికి మారుపేరు. భారత దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టీసీఎస్​ ఉద్యోగుల విషయంలో చాలా హుందాగా వ్యవహరిస్తుంది. క్యాంపస్ నుంచే పెద్ద మొత్తంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించి.. సంస్థకు కావాల్సిన విధంగా మార్చుకోవడం ఈ సంస్థ ప్రత్యేకత. అయితే  ఉద్యోగుల విషయంలోనే టీసీఎస్​ ఓ రికార్డును తాజాగా సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఉన్న అన్నీ ఐటీ సంస్థల్లో కంటే టీసీఎస్​ ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించింది.

మొదటి నుంచి కూడా ఈ సంస్థ భారీ ఎత్తున నియామకాలను చేపడుతుంది. ఈ క్రమంలోనే మహిళలకు కూడా పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. ఉద్యోగులను నియమించుకునే క్రమంలోనే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులకు జాబులు ఇచ్చి రికార్డు సాధించింది. భారత్​ లో మహిళలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థగా టీసీఎస్​ కొత్త చరిత్ర సృష్టించింది. బ‌ర్గండి ప్రైవేట్ హురున్ ఇండియా అనే సంస్థ ఇటీవల ఓ జాబితాను ప్రకటించింది. ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఏ సంస్థ లో పని చేస్తున్నారు అనే దానిపై ఈ సంస్థ చేపట్టిన సర్వేలో కీలక అంశాలు వెలుగ చూశాయి. ఈ సంస్థ ప్రకటించిన దాని ప్రకారం.. ప్రపంచంలో ఉండే సుమారు 500 కంపెనీల్లో ఉండే మహిళా ఉద్యోగుల విషయంలో టీసీఎస్​ ఫస్ట్​ ప్లస్ లో నిలిచింది.

ఈ టీసీఎస్​ సంస్థలో సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం పురుషులే అయినా..  మహిళా ఉద్యోగులు మిగతా కంపెనీలతో పోల్చితే ఎక్కువగా ఉన్నారు. ఈ సంస్థలో సుమారు 65 శాతం మంది పురుషులు ఉంటారు. మరో 35 శాతానికి పైగా మహిళా ఉద్యోగులు ఉన్నారని ఆ సర్వే సంస్థ స్పష్టం చేసింది.

సంస్థలో మహిళలకు కూడా మంచి భాగస్వామ్యం కల్పిస్తుంది టీసీఎస్​. గతంలో 30 శాతం మేర ఉన్న మహిళా ఉద్యోగులు వారి సంఖ్యను మరింత పెంచి 35 శాతానికి చేర్చింది. అంతకంతకూ దినదినాభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో వచ్చిన విశేష మార్పులతో మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరిగినట్లు నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సంస్థ నడుస్తున్న బాటలోనే ఇన్ఫోసిస్ కూడా నడుస్తోంది. సుమారు 40 మందికి ఉద్యోగాలు కల్పించి రెండో స్థానంలో నిలిచారు.
Tags:    

Similar News