ప్రత్యేక హోదా సెంటిమెంట్ రోజు రోజుకు బలపడుతోంది. దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్న ఏపీ ప్రజలు ఆత్మహత్యలకు కూడా వెనుకాడడం లేదు. నెల్లూరులో కాంగ్రెస్ కార్యకర్త మునికోటి మరణంతో ప్రారంభమైన ఈ ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం నెల్లూరు జిల్లా వెంకటాయపాళెంలో వికలాంగుడు లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకోగా శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుడివాడకు చెందిన టీడీపీ మహిళా నేత కుమారుడు ఉదయభాను(40) గత రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్న సంకేతాలు వెలువడడంతో రెండు రోజులుగా ఆందోళనతో ఉన్న అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతని సూసైడ్ లేఖలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా రానందునే చనిపోతున్నట్టు పేర్కొన్నాడు. మృతుడు గుడివాడ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు సిరిపురపు తులసీరాణి కుమారుడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు విచారిస్తున్నారు.
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నా... ఏపీ కోసం ఏ నాయకుడు కూడా నిజాయితీగా పోరాడడం లేదన్న భావన్న ప్రజల్లో బాగా నాటుకుపోయింది. దీంతో రాష్ర్ట విభజన వల్ల నష్టపోయిన..ఉద్యోగాలు కోల్పోయిన పలువురు క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నాలు చేసి ప్రాణాలు కోల్పోతున్నారు.