తెలుగుదేశం పార్టీ మహానాడు సక్సెస్ సంబరాల్లో ఉండగానే ఒక వికెట్ పడిపోయింది. ఆ వికెట్ సినీ గ్లామర్ నిండుగా కలిగినది. ఆమె దివ్యవాణి. 90 దశకంలో హీరోయిన్ గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్ళి పుస్తకం ఫేమ్ గా ఫ్యామిలీ జనాలను ఆకట్టుకుంది. దివ్యవాణి కొన్నాళ్ళ క్రితం తన రాజకీయ కార్యక్షేత్రంగా టీడీపీని ఎంచుకున్నారు.
ఆమె ఆ పార్టీ నుంచి తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తూ వచ్చారు. ఆమె వైసీపీ మీద చాలా పెద్ద స్థాయిలోనే మాట్లాడేవారు. జగన్ మీద నేరుగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఆమె దూకుడు రాజకీయం చూసి టీడీపీలో అధికార ప్రతినిధి హోదాను కూడా ఇచ్చారు. ఇక అధికార పార్టీని ఎప్పటికపుడు ఎండగట్టడంలో దివ్యవాణి ముందు వరసలో ఉండేవారు.
ఇక ఆమె చంద్రబాబుకు విధేయురాలిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె పార్టీలో కీలకంగా ఉండడం అదే పార్టీలో నచ్చని వారు కూడా ఉన్నారని అంటారు. వారినే ఇపుడు దివ్యవాణి దుష్టశక్తులు అని అభివర్ణించారు.ఇవన్నీ పక్కన పెడితే మహానాడుకి దివ్యవాణికి ఆహ్వానం లభించలేదని చెబుతున్నారు. దాంతో పార్టీకి అతి పెద్ద పండుగగా ఉన్న ఆ కార్యక్రమానికి ఆమె వెళ్లలేదని కూడా తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే కొద్ది రోజులుగా ఆగ్రహంగా ఉన్న దివ్యవాణి తన రాజీనామా నిర్ణయాన్ని ఈ రోజు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఇక ఆమె తొందరలోనే అన్ని విషయాలను మీడియా సమావేశం పెట్టి మరీ చెబుతాను అని కూడా అంటున్నారు. మరి ఆ సమావేశంలో పార్టీలో దుష్టశక్తులు ఎవరో ఆమె చెబుతారా అన్న చర్చ వస్తోంది. ఇదిలా ఉండగా తెలుగు మహిళా విభాగంలోనే కొందరు నాయకులు ఆమె ఎదుగుదలను అడ్డుకుంటున్నారు అన్న ప్రచారం కూడా సాగుతూ వస్తోంది.
ఇంకో వైపు చంద్రబాబు మీద కూడా ఆమె విమర్శలు చేసినట్లుగా చెబుతున్నారు నా శవాన్ని కూడా ముందుపెట్టి చంద్రాబాబు ఓట్లు అడుక్కుంటాడేమో అని ఆమె కామెంట్స్ చేసినట్లుగా చెబుతున్నారు. అంటే చంద్రబాబు మీద కూడా ఆమె ఫైర్ అవుతున్నారు అని అనుకోవాలి.
ఇక తెలుగుదేశం పార్టీ ఎన్టీయార్ స్థాపించారని, ఆయన ఒక సమున్నతమైన కళాకారుడని దివ్యవాణి పేర్కొంటూ అటువంటి కళాకారుని పార్టీలో సాటి కళాకారులకు చోటు లేదని దివ్యవాణి అనడం కూడా విశెషం. ఇక మహానాడు విజయంతో ఉంటే దాన్ని సైడ్ చెసేలా దివ్యవాణి రాజీనామా ఎఫెక్ట్ పడిందని అంటున్నారు.
ఆమెకు పార్టీఎలో ఎంత బలం ఉంది అన్నది పక్కన పెడితే ఒక సినిమా హీరోయిన్ గా ఆమె చెప్పే మాటలు జనాల్లోకి పోతాయని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో దుష్టశక్తులు ఉన్నాయని దివ్యవాణి చెప్పినది నిజమైతే సర్దుకోవాల్సిందే.