జనసేన, టీడీపీ.. ఆ నియోజకవర్గంలో సహకారం?
తెలుగుదేశం , జనసేన పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో పరస్పరం సహకరించుకొంటూ ఉన్నాయనే విశ్లేషణలు గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. లోకేష్ పోటీ చేస్తున్న చోట జనసేన పోటీలో లేకపోవడం ఇంకా పలు నియోజకవర్గాల్లో జనసేన పోటీ వ్యూహాత్మకంగా చేస్తోందని, తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకే అనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ జాబితాలోనే తిరుపతి నియోజకవర్గం పేరు కూడా వినిపిస్తుండటం విశేషం. తిరుపతిలో జనసేన- టీడీపీల మధ్యన అనధికార ఒప్పందం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మకు టికెట్ ఖరారు అయ్యింది. అయితే ఆమె భర్త మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. సానుభూతి ఎన్నికల్లో నెగ్గిన వ్యక్తి. ఆమె అభ్యర్థిత్వం విషయంలో తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన అసంతృప్తులు ఉన్నాయి.
తుడా మాజీ చైర్మన్ ఒకరు టీడీపీ టికెట్ ఆశించారు. అయితే.. చంద్రబాబు నాయుడు వారెవరికీ అవకాశం లేదు. సుగుణమ్మకే టికెట్ ఇచ్చారు. ఆమెకు టికెట్ దక్కడమే పెద్ద ఆశ్చర్యకరమైన అంశం అయ్యింది టీడీపీ శ్రేణులకు. ఇదంతా వ్యూహాత్మకం అని.. జనసేనకు సానుకూలం అయిన ఈ సీట్లో మరింత సహకారం అందించేందుకే తెలుగుదేశం పార్టీ వాళ్లు సుగుణమ్మను బరిలోకి దించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రజారాజ్యం గెలిచిన సీటు ఇది. ఇలాంటి నేపథ్యంలో జనసేనకు తిరుపతి మీద చాలా ఆశలున్నాయి. చదలవాడ కృష్ణమూర్తిని పవన్ ఇక్కడ అభ్యర్థిగా బరిలోకి దించారు. అంతే కాదట.. తిరుపతిలో మూడు రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారట పవన్ కల్యాణ్!
ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ జనసేన ఊపు మీదకు వస్తోంది. తెలుగుదేశం పార్టీలోని చాలా మంది నేతలు ఇప్పటికే చదలవాడకు సహకారం ఇచ్చేందుకు రెడీ అయ్యారని స్థానికంగా అనుకుంటున్నారు. ఇదంతా వ్యూహాత్మకమే అని.. కూడా అంటున్నారు.