ఐపీఎస్ ల బదిలీలతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. తెలుగుదేశం పార్టీ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇంటెలిజెన్స్ అసలు ఎన్నికల విధులకు సంబంధం లేని విభాగం. ఆ చీఫ్ ను బదిలీ చేయడం ఏంటని తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. . వైసిపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా తీసుకుంటుందన్నది చంద్రబాబు ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
ఇదిలా ఉండగా... ముగ్గురు ఐపీఎస్ ల బదిలీపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వారి బదిలీని తప్పు పడుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. దీనిపై బుధవారం మధ్యాహ్నం కోర్టు విచారణ జరపనుంది. ఏపీ నిఘా విభాగాధిపతి వెంకటేశ్వరరావు సహా శ్రీకాకుళం - కడప ఎస్పీలను ఎన్నికల సంఘం తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగుతిన్న తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లింది.
బదిలీ అయిన ముగ్గురు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని వైకాపా చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఈ చర్యలు చేపట్టింది. ఎన్నికల విధులకు సంబంధం లేని అధికారులను బదిలీ చేయడం అభ్యంతరకరమని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీంతో హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చి పిటిషన్ పై వాదనలు వినిపించాలని ఆదేశించింది.