నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గెలుపు కష్టమే అని తెలుస్తుండడంతో ఆయన సర్వశక్తులనూ మోహరిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నడూ లేనట్లుగా ఒక ఉప ఎన్నిక కోసం ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను అక్కడ ఇన్ ఛార్జిలుగా నియమించి అక్కడే తిష్ఠవేయిస్తున్నారు. దీంతో నంద్యాలలో ఓటర్ల కంటే బయటనుంచి వచ్చే టీడీపీ నేతలే ఎక్కువమంది కనిపిస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే నంద్యాలలో మంత్రులు - స్థానిక టీడీపీ నేతలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. తాజాగా రాజకీయ పరమైన అవసరాల నిమిత్తం విజయమే లక్ష్యంగా 12 మంది ఎమ్మెల్యేలను ఇన్ చార్జిలుగా నియమించారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అనంతరం వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో 12 మంది ఎమ్మెల్యేలకు గంట సేపుకు పైగా దిశానిర్దేశం చేశారు.
నంద్యాలలో టిడిపి అభ్యర్ధిని గెలిపించాల్సిన బాధ్యత మీ 12 మందిపై ఉందని వ్యూహాత్మకంగా, ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలని కోరారు. లక్ష్య సాధనలో అలసత్వం పనికిరాదని హెచ్చరించిన చంద్రబాబు ... ఉప ఎన్నిక ముగిసే వరకు వ్యక్తిగత పనులన్నీ పక్కకు పెట్టి పార్టీకి దీనికోసమే పనిచేయాలని ఆదేశించారు.
ఇందుకోసం వారికి కొంత సమాచారం అందించి గైడెన్సు ఇచ్చారు. భూమా నాగిరెడ్డి మృతి అనంతరం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమేం ఉన్నాయన్నది చెప్పారు. పెన్షన్ లు - గృహ నిర్మాణ పథకాలు - రోడ్లు - ఇరిగేషన్ వంటి పనులపై ప్రజలకు ఏం చెప్పాలి.. ఎలా చెప్పాలన్నది వారికి బ్రీఫింగ్ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నిక కూడా ముగిసినందున త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని.. వెంటనే నంద్యాలలోకి ఎంటరై పని మొదలు పెట్టాలని వారికి సూచించారు. ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ - బొండా ఉమామహేశ్వరరావు - నిమ్మల రామానాయుడు తదితరులకు ఈ బాధ్యతలు అప్పగించారు.