ఆ విష‌యంలో టీడీపీ చాలా సీరియ‌స్‌.. మ‌రి ఏం చేస్తుంది?

Update: 2022-01-21 04:38 GMT
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో గుడివాడ విష‌యం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. రాజ‌కీయంగా దీనిని వాడుకో లేక పోయామా? అనే చ‌ర్చ సాగుతోంది. సంక్రాంతి సంద‌ర్భంగా.. మంత్రి కొడాలి నాని సొంత నియోజ‌క‌వ‌ర్గం .. ఆయ‌న సొంత క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో గోవా త‌ర‌హా క్యాసినో నిర్వ‌హించారు. దీనికి సంబంధించి మీడియాలో నూ వార్త‌లు వ‌చ్చాయి. ఎంట్రీ ఫీజు రూ.10 వేలు ఉంద‌ని.. కేవ‌లం మూడు రోజుల్లోనే రూ.200 కోట్లు సంపా యించుకున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై టీడీపీ నేత‌లు ఆదిలో లైట్ తీసుకున్నారు. ఒక్క‌రిద్ద‌రు మాత్ర‌మే.. నేత‌లు స్పందించారు.

అయితే.. కీల‌క‌మైన‌.. ఇంత పెద్ద‌వ్య‌వ‌హారాన్ని పార్టీ సీరియ‌స్‌గా తీసుకోలేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌ధా నంగా త‌మ‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తున్న‌.. మంత్రి కొడాలి నానిని అడ్డంగా బుక్ చేసేందుకు వ‌చ్చిన బంప‌ర్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నార‌ని.. కొంద‌రు నాయ‌కులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు. ఆది నుంచి కూడా కొడాలి  నాని టీడీపీ అధినేత‌ను టార్గెట్ చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కురాజ‌కీయంగానే ఎదుర్కొన్న నాయ‌కుల‌కు ఇప్పుడు మంత్రిని బ‌లంగా ఎదుర్కొనేందుకు గుడివాడ ఇష్యూ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో దీనిని స‌రైన విధ‌గా వాడ‌లేద‌ని.. మంత్రిని అనుకున్న విధంగా టార్గెట్ చేయ‌లేక పోయామ‌ని కొంద‌రు నాయ‌కులు భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆగ‌మేఘాల‌పై స్పందించారు. గుడివాడ ఘ‌ట‌న‌పై నిజ‌నిర్ధార‌ణ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలతో కూడిన ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న మేర‌కు వారు శుక్ర‌వారం గుడివాడ‌లో ప‌ర్య‌టించి..కేసినోపై వాస్త‌వాల‌ను ప‌రిశీలించే ప్ర‌య‌త్నం చేస్తారు.  మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఈ కమిటీకి సమన్వకర్తగా వ్యవహరిస్తారు. కొడాలి కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన క్యాసినోపై కమిటీ పూర్తిస్థాయి నివేదికను రూపొందించి అధిష్టానానికి ఇవ్వనుంది. జూదాలతో ఈ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా భ్రష్టుపట్టిస్తోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మ‌రి ఇప్ప‌టికే తీవ్ర‌స్థాయిలో జాప్యం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News