చంద్ర‌బాబు 'ముంద‌స్తు' పై త‌మ్ముళ్ల కామెంట్స్ ఇవే..!

Update: 2022-11-01 01:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర‌చుగా త‌న పార్టీ నేత‌ల‌తో చెబుతున్న మాట‌ ముంద‌స్తు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.. ఉండొచ్చు.. అనే!! ఆయ‌న త‌న పార్టీ నాయ‌కుల‌ను రాజ‌కీయంగా గాడిలో పెట్టాల‌ని భావించిన ప్ర‌తిసారీ.. ఇదే త‌ర‌హా సంకేతాలు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం 117 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న నాయ‌కు ల‌కు చంద్ర‌బాబు క్లాస్ ఇచ్చారు. పార్టీ త‌ర‌ఫున బ‌లంగా ప‌నిచేయాల‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని అన్నారు. ప్ర‌బుత్వ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై పోరాటాలు ఉద్రుతం చేయాల‌ని కూడా సూచించారు.

ఇదేస‌మ‌యంలో ముంద‌స్తు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా నాయ‌కులు రెడీగా ఉండాల‌ని గ‌ట్టిగా చెబుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఈ మాట  ఏడాదిన్న‌ర కాలంగా చెబుతుండ‌డంతో త‌మ్ముళ్ల‌కు `ఈ మాట పాత‌పాటే` అనే ధోర‌ణి అయిపోయింది. ``మా నాయ‌కు డు ముంద‌స్తు అంటున్నారు. ఈ మాట కొత్త‌దికాదు. పాత‌దే. అయితే.. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఊసు లేదు. ముంద‌స్తు.. ముంద‌స్తు.. అని మేం జ‌పం చేయ‌డ‌మే కానీ.. వైసీపీ ఎందుకు ముందస్తుకు వెళ్తుంది?  అస‌లు ఆ త‌ర‌హా సంకేతాలు కూడా లేవుక‌దా!`` అని కొంద‌రు నాయ‌కులు బాహాటంగానే అంటున్నారు.

మ‌రికొంద‌రు నాయ‌కులు చంద్ర‌బాబు చెబుతున్న ముంద‌స్తుపై లైట్ తీసుకుంటున్నారు. ఆయ‌న అలానే చెబుతారు లే! ముంద‌స్తు లేదు.. ఏమీ లేదు. అని అంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లను లైట్ తీసుకుంటున్న వారే ఎక్కువ‌గా ఉన్నార‌నిచెబుతున్నారు.

అయితే, మ‌రికొంద‌రు మాత్రం ఏమో.. చెప్ప‌లేం వ‌చ్చినా రావొచ్చు.. ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఈ నేప‌థ్యంలో మంద‌స్తును తోసిపుచ్చ లేమ‌ని అంటున్నారు. ఏదేమైనా.. మెజారిటీ నాయ‌కులు మాత్రం చంద్ర‌బాబు చెబుతున్న విష‌యాన్ని ముందు సీరియ‌స్‌గా తీసుకున్నా..త‌ర్వాత ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

ఈ ప‌రిణామాలు కూడా చంద్ర‌బాబుకు చేరాయి. దీంతో ఆయ‌న ఇప్పుడు మ‌రో రూటు ఎంచుకున్నారు. ముంద‌స్తు వ‌స్తుందా?  రాదా? అనే విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా.. పార్టీకోసం మీరు ఏం చేస్తున్నార‌నేదే నాకు ముఖ్యం. మీరు అలెర్ట్ గా లేక పోతే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రికల అస్త్రాన్ని సంధిస్తున్నారు. దీంతో ఇప్పుడు నాయ‌కులు క‌దులుతారా?  లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు.. టీడీపీ అనుస‌రిస్తున్న ప్ర‌తి విష‌యాన్నీ ఈ పార్టీ నాయ‌కుల‌కంటే కూడా.. వైసీపీ అధిష్టానం చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తోంది. దీనికి అనుగుణంగా ఎత్తులు వేసుకుంటోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News