బ్రేకింగ్: బెయిల్ నిరాకరణ.. టీడీపీ నేత పట్టాభికి 14రోజుల రిమాండ్

Update: 2021-10-21 12:31 GMT
ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి కోర్టు షాకిచ్చింది. విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. నవంబర్ 2 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు వెల్లడించింది.

బుధవారం పట్టాభి అరెస్ట్ అనంతరం ఆయన తరుఫు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు కోర్టులో హాజరుపరుచగా బెయిల్ పై వాదనలు కొనసాగాయి. పట్టాభి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి వివరణ ఇచ్చారు. ఇప్పటికే తన ఇంటిపై పలుమార్లు దాడి చేశారని పేర్కొన్నారు.

తాను సీఎంను కానీ.. ప్రభుత్వంలో ఉన్న వారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదని కోర్టులో జడ్జికి పట్టాభి వివరించారు. ఇప్పటికే తన ఇంటిపై పలుమార్లు దాడి చేశారని జడ్జికి వివరించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ పట్టాభి న్యాయమూర్తికి తెలిపారు.

తాను విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడలేదని.. తన ప్రెస్ మీట్ వీడియో క్లిప్పింగ్ పరిశీలించాలంటూ పట్టాభి న్యాయమూర్తిని వేడుకున్నారు. తనకు నోటీస్ ఇవ్వకుండానే రాత్రి 9.30 గంటల సమయంలో అరెస్ట్ చేశారని తెలిపారు. కాన్ఫెషన్ స్టేట్ మెంట్ లో మధ్యవర్తులు లేకుండానే తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని న్యాయమూర్తికి పట్టాభి వివరించారు. ఈక్రమంలోనే కోర్టు బెయిల్ నిరాకరించడంతో పట్టాభిని మచిలీపట్నం జిల్లా జైలుకు తరలించారు.
Tags:    

Similar News