సినిమా టికెట్ల విషయంలో కఠువుగా మాట్లాడుతున్న మంత్రి పేర్నినానిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విరుచుకుపడ్డారు. ఎంత సేపు సినిమా టికెట్లు బ్లాక్ లో ఎలా అమ్ముదామా? థియేటర్లు ఎలా మూపిద్దామా? ఎవడిని ఎక్కడ బ్లాక్ మెయిల్ చేద్దామా? ఈ దిక్కుమాలిన వ్యవహారాలు తప్పితే బందర్ పోర్టు గురించి నీకు పట్టదా? అని పట్టాభి ఫైర్ అయ్యారు. మచిలీపట్నం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన పేర్ని నాని ముందు నీ నియోజకవర్గంలో బందరు పోర్టు గురించి తొలుత స్పందించాలని.. దాన్ని అభివృద్ధి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ఏపీ మేరిట్ పోర్టును దివాళా తీయించారని.. వెళ్లి చూసుకొని పనికి వచ్చే పనులపై మంత్రి పేర్ని నాని దృష్టి పెట్టాలని పట్టాభి కోరారు. నీ బందర్ పోర్టు పరిస్థితి ఏంటని పట్టాభి నిలదీశారు. ఎందుకని టెండర్ ఎవరూ వేయడం లేదని.. దీనికి సిగ్గుపడాలని పట్టాభి నిలదీశారు.
స్థానిక ఎమ్మెల్యే అయిన నువ్వు మచిలీపట్నంకు ఏం చేశావో చెప్పాలని పట్టాభి చెప్పారు. చంద్రబాబు బందర్ పోర్టును మంజూరు చేసి స్థల సేకరణ చేసి ఇస్తే ఈ రెండున్నరేళ్లలో దాన్ని అటకెక్కించి ఎందుకు నిర్మించలేదని పట్టాభి ప్రశ్నించాడు. బందరు పోర్టును సర్వనాశనం చేసింది మీ ప్రభుత్వం అని ఆరోపించారు. నిధులన్నీ దిగమింగుకొని అన్నారు. మీడియా ముందుకు వచ్చి సినిమా టికెట్ల వ్యవహారాన్ని పక్కనపెట్టి బందరు పోర్టు గురించి ముందు మాట్లాడు అని పేర్నినానికి పట్టాభి కౌంటర్ ఇచ్చాడు. రాష్ట్ర ప్రజలకు మచిలీపట్నం పోర్టు గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మ్యారీటైం పోర్టు, బందర్ పోర్టును ఎందుకు వైసీపీ ప్రభుత్వం నిర్మించడం లేదో సమాధానం చెప్పాలని పట్టాభి ప్రశ్నించారు. బందరులో ప్రెస్ మీట్ పెట్టి ముందు సమాధానం ఇవ్వాలని.. సినిమా బ్లాక్ టికెట్ల లొల్లి గురించి తర్వాత చెప్పు అని నిలదీశారు.
గంగ వరం పోర్టు గురించి అడిగితే చెప్పలేదని.. ఇప్పటికైనా ఏపీ మారిటం బోర్డు గురించి సమాధానం చెప్పాలని పట్టాభి ప్రశ్నించారు. రాష్ట్రంలోని పోర్టులన్నింటిని సర్వనాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం అన్నారు.
Full View