ప్రధాని మోదీని కలిసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని మోదీ వేరే పనుల్లో బిజీగా ఉండడంతో నరసింహన్ తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని తిరుగుటపా కట్టారు. అదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు....గవర్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను ఏకం చేసేందుకు గవర్నర్ కుట్రపన్నుతున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలను నిజం చేసేలా గవర్నర్ ప్రవర్తన ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా, గవర్నర్ పై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలలో గవర్నర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. మొదటి నుంచి టీడీపీకి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అందుకే తాము చాలాకాలంగా గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
వాస్తవానికి ఎప్పటినుంచే గవర్నరు వ్యవహార శైలిపై టీడీపీ నేతలకు అసంతృప్తి ఉంది. అయితే, సందర్భం రాలేదు కాబట్టి వారు బయటపడలేదు. నాలుగు రోజుల క్రితం చంద్రబాబుతో గవర్నర్ భేటీ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. కేంద్రంతో రాజీ ధోరణిలో ఉండాలని గవర్నర్ ....కేంద్రానికి మద్దతు తెలుపుతున్నట్లు గవర్నర్ ఆ భేటీలో మాట్లాడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో, గవర్నర్ పై టీడీపీ తమ మాటల దాడిని ముమ్మరం చేసింది. మంత్రులు అచ్చెన్నాయుడు - జవహర్ - నక్కా ఆనంద్ బాబు - నారాయణ - జేసీ దివాకర్ రెడ్డి - కంభంపాటి రామ్మోహన్ రావులు కూడా గవర్నర్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ఏపీకి మద్దతివ్వాల్సిన గవర్నర్....కేంద్రానికి అనుకూలంగా మాట్లాడడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, కేంద్రం కనుసన్నల్లో గవర్నర్ పని చేస్తున్నారని - టీడీపీపై పవన్ యుద్ధం ప్రకటించడం వెనుక కూడా ఆయన పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ తగిన సమాచారం ఇవ్వడం లేదని మంత్రి నారాయణ విమర్శించారు. నరసింహన్ బతకనేర్చిన వ్యక్తని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో మోదీకి అత్యంత సన్నిహుతుడు గవర్నర్ అని అన్నారు. గవర్నర్.....గుళ్లు - గోపురాల సందర్శన - ప్రోటోకాల్ ఖర్చులకే రూ.కోట్లు ఖర్చవుతున్నాయని నక్కా ఆనంద్ బాబు అన్నారు. అమిత్ షా - మోదీ మాఫియాలా కుట్రలు - కుతంత్రాలు చేస్తున్నారని....అందుకే జాగ్రత్తగా ఉండాలని సీఎం చెబుతున్నారన్నారు. గవర్నర్ పిలిచి మాట్లాడిన తర్వాతే పవన్ సభ పెట్టి తమను తిట్టారని టీడీపీ నేతు ఆరోపిస్తున్నారు. అయితే, గవర్నర్ వ్యవస్థపై చంద్రబాబు వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు ఖండించారు. ప్రధానిపై బాలకృష్ణ వ్యాఖ్యలను పక్కదారి పట్టించుందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.