నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంతో ముడిపడి నియోజకవర్గంలో తమ శక్తియుక్తులన్నీ ఒడ్డి పనిచేస్తున్న తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఒకటే పల్లవి అందుకున్నారు. ఎవడిని కదిలించినా సరే.. నంద్యాలలో తెదేపా అభ్యర్థి 50 వేల మెజారిటీ సాధించడం ఖాయం అని ఘాటుగా సెలవిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మాటలతో వారిని అంత తీవ్రంగా ప్రభావితం చేసేసినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు మొన్న నంద్యాలలో పాల్గొన్న సభలో తమ పార్టీకి యాభై వేల మెజారిటీతో విజయాన్ని కట్టబెట్టాలని ప్రజల్ని కోరారు. అధినేత అలా కోరాడో లేదో.. అప్పుడే ఆ మెజారిటీ దక్కేసినట్లుగా ఛోటా మోటా నాయకులంతా బిల్డప్ లు ఇచ్చేస్తున్నారు.
నియోజకవర్గానికి ఇన్ ఛార్జులుగా ఉన్న, అక్కడ ప్రచార బాధ్యతలను భుజాన మోస్తున్న ప్రతి నాయకుడూ ఇప్పుడు యాభైవేల వద్దే పాట పాడుతున్నారు. మంత్రి దేవినేని ఉమా నంద్యాలలో మాట్లాడుతూ మెజారిటీ యాభైవేలు గ్యారంటీ అన్నారు. అలాగే ఇక్కడ గెలుపు బాద్యతలను తీసుకున్న మరో మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఇదే మాట అంటున్నారు. చూడబోతే తెదేపాలో అందరికీ ఇదొక్కటే పల్లవి అయిపోయినట్లుంది.
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సరదాగా కొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తెదేపా వారి నోళ్లకు తాళాలు పడాలంటే ఏం చేయాలంటే.. అంటూ ఒక్కొక్కరూ ఒక్కోరీతిగా జోకులు వేసుకుంటున్నారు. యాభైవేలు మెజారిటీ రాకపోతే గనుక.. తమ మంత్రి పదవుల్ని వదులుకోవాల్సిందిగా ఓ చిన్న సవాలు విసిరితే సరి.. అక్కడితో ప్రగల్భాలు పలుకుతున్న వారి నోర్లన్నీ టక్కున మూతపడతాయ్ అనీ.. రకరకాలుగా సరదాగా వ్యాఖ్యాలు రువ్వుతున్నారు.
నంద్యాలలో గనుక విజయం సాధించకపోతే.. దాని ప్రభావం యావత్తు రాష్ట్రం మీద చాలా ఘోరంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ భయపడుతోంది. అందుకే గతంలో ఏ ఉప ఎన్నికకూ లేని స్థాయిలో వారు ఇక్కడ సీనియర్ నాయకులందరినీ మోహరించి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అలాగే.. ఉప ఎన్నికల్లో వైకాపాకు చెందిన అభ్యర్థి.. మొన్నటిదాకా తమ జిల్లా పార్టీకి సారథిగా వ్యవహరించిన వాడే అయినప్పటికీ, ఆయన మీద ఎక్కడ లేని ఆరోపణలు చేయడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు. తాము చేయగలిగింది చెప్పుకోవడం ఒక్కటే గెలపిస్తుందనే నమ్మకం వారికి చిక్కినట్టు లేదు... ప్రత్యర్థిని పుష్కలంగా బద్నాం చేస్తే తప్ప గెలవలేం అని వారు భయపడుతున్నట్లుగా ఉంది. ఇన్ని భయాల మధ్య పైకి మాత్రం 50 వేల మెజారిటీ అంటూ వారు పలుకుతున్న బడాయి మాటలకు అడ్డుకట్ట పడాలంటే.. ఎవరో ఒకరు ఘాటుగా ఆ మాటకు కట్టుబడి ఉండాలని సవాలు విసిరితే సరిపోతుంది.