న‌దిని క‌బ్జాచేసిన అధికార పార్టీ నేత‌లు

Update: 2017-04-28 10:09 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో కృష్ణా న‌దిలో క‌బ్జాలు చేసిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌పై అధికారులు స్పందించిన‌ట్లు తెలుస్తోంది. నది మధ్యలో రిసార్ట్స్ - మల్టీప్లెక్స్‌ లు నిర్మించుకునేందుకు సుమారు 150 ఎకరాల విస్తీర్ణం చుట్టూ హద్దులతో ఎర్ర జెండాలు ఏర్పాటు చేశార‌ని ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై   తీవ్రంగా స్పందిస్తూ కబ్జాదారులు వేసిన ఫెన్సింగ్‌ ను గుట్టుచప్పుడు కాకుండా తొలగిస్తున్నారని స‌మాచారం.

కృష్ణా నదిలోని స్థ‌లంలో నీటి మధ్యలో 150 ఎకరాల మేర ఆక్రమించారని ఓ ప‌త్రిక‌లో వార్త‌లు వ‌చ్చాయి.  అందులో రిసార్ట్స్ - మల్టీఫ్లెక్స్‌ లు - పబ్‌ లు - క్లబ్‌ లు నిర్మించేందుకు మట్టి - ఇసుకతో పూడ్చివేశార‌ని స‌ద‌రు ప‌త్రిక వెల్ల‌డించింది.  భారీ పడవల్లో పైపులు - ఇసుక - మట్టి తీసుకెళ్లి జెండాలు పాతిన ప్రాంతంలో నదిని పూడ్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని క‌థ‌నంలో వివ‌రించింది. ఈ వార్త క‌ల‌క‌లం రేగిన నేప‌థ్యంలో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంలో అధికారులు ఆరా తీసిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు క‌బ్జాల వ్య‌వ‌హారంపై ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు - విప‌క్షాలు మండిపడుతున్నాయి.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News