చంద్రబాబు అంటే మోసానికి మారుపేరన్న విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. ప్రజల తరఫున ప్రతిపక్షాలు ఈ విమర్శలు చేస్తుంటాయి. ప్రజల్లోనూ చాలామంది ఇదే మాట అంటుంటారు. రుణమాఫీ పేరుతో డ్వాక్రామహిళలను మోసగించారని.. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసగించారని.. మంచి ప్యాకేజీల పేరుతో అమరావతికి భూములిచ్చిన రైతులను మోసగించారని ఆరోపిస్తుంటారు. ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు టీడీపీ నేతలే చంద్రబాబు తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఎస్సీలను చంద్రబాబు మోసగించారని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆరోపించారు. మరోవైపు పార్టీ నాయకత్వం తమను మోసం చేసిందంటూ కడప జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు.
టీడీపీ నాయకత్వం తమను అంటరానివారిగా చూస్తోందంటూ కడపలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు కొందరు దళిత టీడీపీ నేతలు. దశాబ్దాలుగా టీడీపీ జెండా మోస్తున్నా తమను మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. పార్టీ కోసం పనిచేసి ఎంతో నష్టపోయామని దీక్షలో కూర్చున్న నాయకులు ఆరోపించారు.
అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా తమను పక్కన పడేసి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారని ఆవేదన చెందారు. 15ఏళ్లుగా టీడీపీ కోసం కష్టపడుతున్నా తమకు ఏ మాత్రం గౌరవం, గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. తానిప్పుడు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని కంటతడి పెట్టుకున్నారు. పార్టీని నమ్ముకుని నష్టపోయిన తనలాంటి వారు చాలా మంది ఉన్నారన్నారు. గత్యంతరం లేకనే జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఇలా అమరణదీక్షకు దిగాల్సి వచ్చిందని పార్టీ నేతలు చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/