ఎంత ప్రయత్నించినా.. జగన్ ఫోబియాలో నుంచి బయటకు రాలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర తెలుగు తమ్ముళ్లకు వణుకు పుట్టిస్తోంది. తమకున్న మీడియా అండతో జగన్ పాదయాత్రను ఎంత తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదని వాపోతున్నారు.
జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు వీలుగా ఎన్ని కుయుక్తులు పన్నినా.. ప్రజాభిమానం మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం.. అంతకంతకూ పెరిగిపోతున్న వైనం తమ్ముళ్లకు ఇబ్బందిగా మారుతోంది. తమకు అనుకూల మీడియాగా పేరున్న వాటిల్లోనూ జగన్ పాదయాత్ర ఫోటోలు పబ్లిష్ కావటం.. వాటిని ఎంత చిన్నగా ప్రచురించినా.. ఫోటోల్లో పోటెత్తుతున్న జన సందోహాం తమ్ముళ్లకు షాకింగ్ గా మారుతోంది.
జగన్ పాదయాత్ర ఫోటోలతో జన సందోహం పెద్దగా లేని రీతిలో ఫోటోలు ప్రచురిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయటం కనిపిస్తోంది. తమ అంతర్గత సంభాషణల్లో తెలుగు తమ్ముళ్లు పాదయాత్ర మైలేజీపై తల్లడిల్లిపోతున్నారు. జగన్ ను ఎంత డ్యామేజ్ చేయాలనుకుంటే.. అంతకు రెట్టింపుగా ఆయన ఇమేజ్ మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో కాపుల రిజర్వేషన్ల మీద ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి.. మాయ పుచ్చేలా హామీని ఇవ్వని వైనాన్ని పట్టుకొని తామెంత ప్రచారం చేసినా.. డ్యామేజ్ కంటే కూడా మైలేజీ రావటంపై ఏపీ అధికారపక్షం మల్లగుల్లాలు పడుతోంది.
కాపులు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్రకు పోటెత్తుతున్న జనసందోహాంపై తమ్ముళ్ల నోట మాట రాని పరిస్థితి. గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ.. కాపుల రిజర్వేషన్ల మీద జగన్ చేసిన వ్యాఖ్యలు సాహసోపేతమైనవని.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేలా వ్యవహరించే విపక్ష నేత తీరు దెబ్బేస్తుందన్న అధికారపక్ష అంచనాలకు భిన్నంగా జగన్ వ్యాఖ్యల్ని గోదావరి ప్రజలు స్వాగతించిన వైనం మింగుడుపడనిదిగా మారింది. మొత్తంగా చూస్తే.. జగన్ పాదయాత్ర ఫోటోలు తమ్ముళ్లను వణికిపోయేలా చేస్తున్నాయి.