తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ సోదాలు జరిగిన నేపథ్యంలో తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై వేటు వేశారు.ప్రాజెక్టుల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని, శుక్రవారం వాకాటి నివాసాలు - కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేసింది. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంకు చేసిన ఫిర్యాదుతో సీబీఐ సోదాలు జరిపింది. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీలో కలకలానికి దారి తీసింది. దీంతో అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వాకాటిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
2014లో బ్యాంకుల నుంచి రూ.190 కోట్లు రుణం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈనేపధ్యంలో ఐఎఫ్సీఐ ఫిర్యాదుతో వాకాటిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి ఇంట్లో శుక్రవారం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో నెల్లూరు - బెంగళూరు - హైదరాబాద్ లోని ఆఫీసులో సోదాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సస్పెండ్ చేశారు. వాకాటి ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై గెలుపొందారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాకాటి నారాయణరెడ్డి అవినీతికి పాల్పడినట్లు వైసీపీ ఆరోపించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/