రాజకీయం ఇది. ఎవరు ఎపుడు ఎక్కడ ఎలా చిక్కుతారో తెలియదు. టైమ్ బాగుంటే అంతా ఓకే. లేకపోతేనే సీన్ ఉల్టా సీదా అవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీలో సర్వసత్తాక మంత్రిగా కొడాలి నాని వీర లెవెల్ లో విహారం చేశారు అనే చెబుతారు. ఆయన దూకుడు మామూలుగా ఉండేది కాదు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునే కార్నర్ చేసి నాని చాలా సార్లు మాటల యుద్ధానికి తెర లేపారు.
నిజానికి నాని టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2012లో ఆయన వైసీపీలో చేరిపోయారు. ఆ తరువాత 2014లో వైసీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలోకి రావడంతో జగన్ వైపు నుంచి ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరిగా నాని ప్రమోషన్ కొట్టేశారు.
ఏ విషయం మీద అయినా ఆయన అసెంబ్లీ లోపలా బయటా టీడీపీని బాబుని, చినబాబుని ఆడేసుకోవడంలో ముందుంటారని పేరు. అలాంటి నాని మీద టీడీపీ బాగానే మండుతూ వస్తోంది. టీడీపీకి గుండె కాయ లాంటి క్రిష్ణా జిల్లాలో ఎన్టీయార్ సొంత ఊరు అయిన గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయిన నాని తమ సామాజికవర్గం ఎక్కువగా అభిమానించే టీడీపీకే ఎదురెళ్ళడం అంటే ఆ వర్గంలో ఎవరూ తట్టుకోలేని పరిస్థితి అనే అంటారు.
ఇక ఒక వర్గం మీడియా సైతం నాని విషయంలో ఆగ్రహిస్తోందని చెబుతారు. అయితే ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్న రాజనీతి మేరకు వైసీపీ వైపు నుంచి నాని టీడీపీ మీద తరచూ విరుచుకుపడే అస్త్రంగా ఉంటూ వచ్చారు. ఏపీలో చంద్రబాబు పది రోజులు తిరిగినా రాని రెస్పాన్స్ ఫోకస్ ని కొడాలి నాని ఆయన్ని విమర్శిస్తూ పెట్టే ఒకే ఒక ప్రెస్ మీట్ తో వచ్చేలా ఎప్పటికపుడు చేసుకున్నారు.
ఒక దశలో ఆయన నోటి వెంట వచ్చే మాటలను చూసి బూతుల మంత్రి అని కూడా విపక్షాలు పేరు పెట్టేశాయి. అలాంటి నానిని పేకాట మంత్రి కూడా అని టీడీపీ ఎద్దేవా చేస్తూ వచ్చింది. ఇక సంక్రాంతి పండుగ వేళలో గుడివాడలో నానికి చెందిన కె కన్వెషన్ హాలులో కేసినోలు నిర్వహించారని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున సాగాయని టీడీపీ పదునైన బాణానే దూసింది. కరెక్ట్ గా నానికి కార్నర్ చేస్తూ గత కొద్ది రోజులుగా రచ్చ చేస్తోంది.
కె కన్వెషన్ హాలులో మహిళలతో అసభ్య నృత్యాలు చేయించారని, దారుణమైన కల్చర్ ని తీసుకువచ్చారంటూ ఏపీ వ్యాప్తంగా ఇష్యూని చేసి పారేసింది. దాంతో పాటు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ కూడా గుడివాడకు అధినాయకత్వం పంపింది. దాంతో గుడివాడ వేదికగా నాని లక్ష్యంగా భారీ స్థాయి పొలిటికల్ వార్ కి టీడీపె సర్వం సిద్ధం చేసింది.
ఈ నేపధ్యంలో కేసినో మంత్రిగా టీడీపీ నేతలు సంభోదిస్తున్నారు. మరో వైపు చూస్తే నాని వైసీపీలోకి వెళ్లే ఇలా తయారయ్యాడని మాజీ మంత్రి కొల్లి రవీంద్ర అంటున్నారు. ఆయన్ని మొదట్లోనే జగన్ అదుపు చేయలేకపోయారు కాబట్టే సీన్ ఇంతదాకా వచ్చింది అని కూడా అంటున్నారు. నాని ఇలాగే కొనసాగితే ఇంకెన్నో అరాచకాలు చేస్తారు అని కూడా రవీంద్ర అంటున్నారు.
కేసినో మంత్రిగా నానిని పదే పదే చెబుతూ ఆయన్ని పొలిటికల్ గా బదనాం చేయడానికి టీడీపీ భారీ స్కెచ్ ని వేసింది అనుకోవాలి. త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో నానిని తప్పించేలా చూడాలన్నదే టీడీపీ తాజా టార్గెట్ అంటున్నారు. చంద్రబాబుని, ఆయన ఫ్యామిలీని కొడాలి నాని ఇప్పటిదాకా ఒక ఆట ఆడుకుంటే ఇపుడు సీన్ తమదని పసుపు పార్టీ చెబుతోంది. ఏలాగైనా ఈ ఇష్యూని అసలు విడవకుండా చేయడం ద్వారా నానికి మాజీ మంత్రిని చేయడమే లక్ష్యంగా తమ్ముళ్ళకు ఉంది అంటున్నారు.
మరి ఈ విషయంలో జగన్ ఏమాలోచిస్తున్నారో ఇప్పటికైతే ఎవరికీ తెలియదు. ఒక విధంగా చూస్తే కొడాలి నాని జగన్ కి అత్యంత సన్నిహితుడు. అయితే టీడీపీ టార్గెట్ చేసిన ఈ ఇష్యూతో వైసీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నానికి జగన్ అతి స్వేచ్చ ఇచ్చారు అన్న మాట కూడా పార్టీ నుంచి వినవస్తోంది. ఆయన హార్ష్ గా మాట్లాడున్న టైమ్ లోనే ఆపాల్సింది అన్నదీ ఉందిట.
ఇంకో వైపు చూస్తే తమ కన్వేషన్ సెంటర్ లో కేసినోలు నిర్వహించినట్లుగా నిరూపిస్తే తాను పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాని అని నాని సవాల్ చేస్తున్నారు. కేసినోలు అంటే తనకు తెలియదని, చంద్రబాబు, లోకేష్ కే బాగా తెలుసు అని ఆయన విమర్శిస్తున్నారు. మొత్తానికి కేసినో ఇష్యూ తో నాని డిఫెన్స్ లో పడ్డారనే అంటున్నారు. చూడాలి మరి జగన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో.