తెలుగు తమ్ముళ్ల నోటి వెంట నిర్వేదం వ్యక్తమవుతోంది. ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వారిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మరికొందరిలో నిర్వేదాన్ని పలికిస్తున్నాయి. చేతిలో అధికారం ఉన్నప్పటికీ టైం బాగోలేదన్న మాట చాలామంది తమ్ముళ్ల నోటి వెంట వినిపిస్తోంది.
తిరుపతిలో ఇటీవల నిర్వహించిన సభలో ప్రకృతి బీభత్సం కారణంగా వేదిక దగ్గర చిందరవందర కావటం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. తమ సభకు ప్రకృతి పులకరించిందని వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు తమ్ముళ్లు మాత్రం.. పులకరింత కాదని.. ప్రకృతి ప్రకోపంగా అభివర్ణించటం గమనార్హం.
తిరుపతిలో జరిగింది ప్లాప్ షో అన్నట్లుగా తెలుగుదేశం నేతలు కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి సభ పూర్తి అయ్యిందో లేదో.. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత గల్లా అరుణకుమారి తాను ఎన్నికల బరిలో ఉండనని స్పష్టం చేసి సంచలనం సృష్టిస్తే.. అంతలోనే దాచేపల్లి దారుణ ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టైం బాగోలేనప్పుడే ఇలాంటివి జరుగుతాయని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు అంతే.. తప్పేం లేకున్నా.. కొన్ని దురదృష్టకర ఘటనలు చోటు చేసుకుంటాయి. అందులో ప్రభుత్వానికి బాధ్యత లేకున్నా.. దానికి సంబంధించిన ఫలితాన్ని కచ్ఛితంగా అనుభవించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. దాచేపల్లిలో యాభైఏళ్ల ముసలాయన ముక్కుపచ్చలారని బాలికను రేప్ చేయటం ఏమిటి? ఆ ఉదంతం ప్రభుత్వం పీకకు చుట్టుకోవటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తే.. తమ టైం బాగోలేదన్న భావనను వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఉదంతాల్ని చూసైనా.. బాబు జాగ్రత్తగా ఉండాలని.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదన్న మాట పలువురి తమ్ముళ్ల నోటి వెంట రావటం గమనార్హం.