రాయలసీమకు చెందిన సీనియర్ నేత మైసూరారెడ్డి టీడీపీలో చేరడానికి అంతా సిద్ధమవుతోంది. ఈసరికే ఆయన టీడీపీలో చేరుతారని అంతా ఊహించినా మైసూరా మాత్రం వైసీపీని వీడిన తరువాత గ్యాప్ తీసుకున్నారు. మైసూరారెడ్డి కుమారుడికి చెందిన రఘురామ్ సిమెంట్స్ భూముల అనుమతి కోసమే ఆయన వైసీపీని వీడినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. తాజాగా ఆయన సీఎం రమేశ్ తో భేటీ కావడంతో టీడీపీలో ఆయన చేరికకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.
ఆదివారం కడప జిల్లా ఎర్రగుంట్లలో టీడీపీ కోటరీలో కీలక నేతగా ఉన్న ఎంపీ సీఎం రమేష్ తో మైసూరారెడ్డితో భేటీ అయ్యారు. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చించారు. అనంతరం మైసూరారెడ్డి - సీఎం రమేష్ ఏకాంతంగా ఒక గదిలోకి వెళ్లి చర్చించుకున్నారు. టీడీపీలో చేరాలని సీఎం రమేష్ కోరినట్టు తెలుస్తోంది.
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున వైఎస్ వివేకానందరెడ్డి నిలబడిన నేపథ్యంలో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని ఇద్దరు నేతలు అనుకున్నట్లు చెబుతున్నారు. వివేకానందరెడ్డిని ఓడించడం ద్వారా జగన్ కు షాక్ ఇవ్వడం ఎలా అన్న దానిపై చర్చించుకున్నారు. త్వరలోనే మైసూరారెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమని కడప జిల్లా నేతలు చెబుతున్నారు.
కాగా మైసూరా రెడ్డి మాత్రం స్థానిక రాజకీయాల గురించి కాకుండా దేశంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై స్పందించారు. పెద్ద నోట్ల రద్దుపై హైకోర్టులో పిల్ వేస్తున్నట్టు మైసూరారెడ్డి చెప్పారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసిందని ఆయన విమర్శించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/