రోజాకు ఆడవాళ్లతోనే పంచాయితీ

Update: 2019-07-27 07:04 GMT
ముల్లును ముల్లుతోనే తీయడం.. ఈ సామెత వినడానికి బాగానే ఉంది కానీ ఆ సాహసం మాత్రం ఎవ్వరూ చేయలేదు. కొందరు ఆప్షన్ లేకపోతే అదే పని చేస్తారు. అయితే ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా విషయంలోనూ టీడీపీ - బీజేపీలు ఈ ‘ముల్లును మల్లుతో’ తీసే స్ట్రాటజీతోనే వెళ్లాలని డిసైడ్ అవ్వడం విశేషం.

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన రోజాకు మంత్రివర్గంలో చోటుఖాయం అనుకున్నారంతా . కానీ సామాజిక సమీకరణాల్లో ఆమెకు చోటు దక్కలేదు. ఏపీఐఐసీ చైర్మన్ గా కీలక బాధ్యతలను జగన్ ఇచ్చారు. అయితే రోజా టాలీవుడ్ సినీ గ్లామర్ నుంచి ఇప్పుడు వైసీపీలో కీలకంగా మారడంతో ఆమెనే స్ఫూర్తిగా టార్గెట్ గా తీసుకొని టీడీపీ - బీజేపీలు తాజాగా స్కెచ్ గీసినట్టు సమాచారం.

సినీ గ్లామర్ తో వచ్చి రాజకీయంగా ఫైర్ బ్రాండ్ అయిన రోజాకు పోటీగా టీడీపీ కూడా అదే సినీ గ్లామర్ ను నమ్ముకుంది. సీనియర్ హీరోయిన్ అయిన వాణి విశ్వనాథ్ ను రంగంలోకి దించబోతోందట. ఇక బీజేపీ కూడా ఇటీవలే దక్షిణాది సీనియర్ నటి ప్రియా రామన్ కు కండువా కప్పి పార్టీలో చేర్చుకుంది. ఈమె బీజేపీ లో కీరోల్ పోషించబోతోందని సమాచారం.

ఇప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాకు ధీటుగా టీడీపీలో వాణి విశ్వనాథ్ ను - బీజేపీలో ప్రియా రామన్ ను తీర్చిదిద్దాలని ఆయా పార్టీలు డిసైడ్ అయ్యారట.. అవసరమైతే రోజా పైనే పోటీచేయించాలని టీడీపీ రెడీ అవుతోందట.. మరి రోజా స్ఫూర్తిగా వస్తున్న ఈ ఇద్దరు సీనియర్ భామలు రోజాను ఎలా ఎదుర్కొంటారు? ఆయా పార్టీల్లో రోజాలా ఎదుగుతారా ? ఎలా నిలదొక్కుకుంటారన్నది వేచిచూడాలి..


Tags:    

Similar News