ఏపీలో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకునే వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధులు.. తాజాగా రాజ్యసభలోనూ ఒక రిపై ఒకరు విమర్శల బాణాలు సంధించుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై టీడీపీ సభ్యుడు కనక మేడ ల రవీంద్రకుమార్ నిప్పులు చెరిగారు. దీనికి ప్రతిగా.. వైసీపీ సభ్యుడు.. విజయసాయిరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.
సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఎండగట్టారు. గుడివాడలో కేసినోపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వైసీపీ నేతలను ఇరుకున పెట్టారు. ఏకంగా మంత్రి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగిందని.. మూడు రోజుల్లో 500 కోట్ల రూపాయలకు పైగానే వ్యాపారం చేశారని.. పైగా.. దీనిని బుకాయించారని కూడా ఆయన రాజ్యసభలో వివరించారు.
ప్రభుత్వానికి కూడా గుడివాడ కేసినోలో భాగస్వామ్యం ఉందన్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కనకమేడల చెప్పారు. కేసినో వంటి సంప్రదాయాలు ఏపీకి తెలియవని... దీనివల్ల.. యువత పెడదోవపడతారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలకు జగన్ చెక్ పెట్టారని కనకమేడల వ్యాఖ్యానించారు. రాజకీయ దురుద్దేశంతో సినిమాలను అడ్డుకున్నారని తెలిపారు.
ఏపీలో ఆర్ధిక అరాచకం నెలకొన్నదన్నారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే చేయిదాటి పోతుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై కనకమేడల ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కనకమేడల ప్రసంగానికి అడుగడుగునా వైసీపీ ఎంపీలు అడ్డుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనకన్నా జగన్ పాలన వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందని వైసీపి ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేసినో వ్యవహారం తమకు సంబంధం లేదని.. చెప్పారు. టీడీపీ రాజకీయంగా దిగజారిపోతోందని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. గతానికి భిన్నంగా వైసీపీ, టీడీపీ సభ్యుల వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో ఉండడం గమనార్హం.