టీమిండియాను ఊరిస్తున్నవిజయం!

Update: 2019-10-05 15:53 GMT
జాగ్ టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తూ ఉంది. చివరి రోజు ఆదివారం ఆట మిగిలిన మ్యాచ్ కు వర్షం గనుక అంతరాయం కలిగించకపోతే  భారత్ విజయం పక్కా అయినట్టే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో సౌతాఫ్రికా గట్టిగానే పోరాడింది. ఎల్గర్, డికాక్ లు సెంచరీలతో ఆదరగొట్టారు. భారత్ ఆధిక్యాన్ని బాగానే తగ్గించారు.

అయితే నాలుగో రోజు ఆటలోనే ఎల్గర్ ను పెవిలియన్ కు పంపాడు రవీంద్ర జడేజా. తొలి ఇన్నింగ్స్ లో రాణించిన ఎల్గర్ ఔట్ కావడం సౌతాఫ్రికాకు మానసికంగా దెబ్బతీసే అంశం. అయితే తొంబై ఓవర్ల ఆట మిగిలి ఉంటుంది. వర్షం అంతరాయం కల్పించకపోతే  మాత్రం భారత స్పిన్నర్లు తిప్పేస్తారు.

మొత్తం 395 పరుగుల లక్ష్యం సౌతాఫ్రికా ముందుంది. ఇక మిగిలిన లక్ష్యం 384.  ఏరకంగా చూసినా ఒక్క రోజులు చేధించడానికి అనువైన లక్ష్యం కాదు అది. సౌతాఫ్రికా లక్ష్యం మ్యాచ్ ను డ్రా చేసుకోవడమే. వరుణుడు సౌతాఫ్రికాను కరుణిస్తే మ్యాచ్ డ్రా అవుతుంది. లేకపోతే భారత్ వశం అవుతుంది.  పోరాడి డ్రా చేసుకోవడం మాత్రం సౌతాఫ్రికన్ బ్యాట్స్ మన్ కు తేలికైన అంశం కాదు. చివరి రోజు భారత పిచ్ లు స్పిన్నర్లకు స్వర్గధామాలుగా ఉంటాయి. ఈ లెక్క ప్రకారం  చూస్తే వైజాగ్ టెస్టులో టీమిండియా విజయం ఖరారు అయినట్టే.

ఇక నాలుగో రోజు ఆటలో భారత బ్యాట్స్ మన్  అదరగొట్టారు. వేగంగా పరులుగు చేస్తూ సౌతాఫ్రికా  ముందు భారీ లక్ష్యాన్ని  నిర్దేశించారు. రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ చేసి సత్తా చూపించాడు.
Tags:    

Similar News