కోట్లాది మంది అభిమానులు ఆశలతో ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ లోకి అడుగుపెట్టిన ఇండియా కథ సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో ఓటమితో ముగిసింది. తొలి నుంచి సెమీస్ వరకు ఒక్క ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్ ల్లోనూ తన విజయయాత్రను దిగ్విజయంగా కొనసాగించిన టీమిండియా జైత్రయాత్రకు న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. ప్రపంచకప్ ఓటమి తర్వాత కోహ్లీ సేన తొలిసారిగా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 3 20-20లు - 3 వన్డేలతో పాటు... రెండు టెస్టుల్లో ఆడనుంది.
ఇప్పుడు టీమిండియాను ఓ ప్లేస్ చాలా టెన్షన్ పెట్టేస్తోంది. అటు సెలెక్టర్లతో పాటు... ఇటు క్రికెటర్లకు కూడా ఇప్పుడు ఆ ప్లేస్ పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ప్లేస్ లో ఎవరిని ఎంపిక ? చేయాలన్నదానిపై ప్రపంచకప్ కు ముందు ఎంత పెద్ద చర్చ నడిచిందో... ఇప్పుడు మళ్ళీ అదే చర్చ స్టార్ట్ అయింది. ప్రపంచ కప్ కు ముందు టీమిండియాలో నెంబర్ నాలుగో స్థానంలో ఎవరు ఆడతారు అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ స్థానం కోసం కేఎల్ రాహుల్ - విజయ శంకర మధ్య పోటీ నడిచింది. రాహుల్ ముందు మ్యాచ్‌లలో ఈ ప్లేస్ లోనే ఆడాడు.
ఆ తర్వాత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాడు. నెంబర్ 4లో బ్యాటింగ్‌కు వచ్చిన విజయ్ శంకర్ ఆ స్థానాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో రిషిబ్ పంత్ ను తీసుకున్నారు. ఆ తర్వాత పంత్ కూడా అందివచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదు.
ఈ క్రమంలోనే ఇప్పుడు విండీస్ పర్యటనకు కూడా ఈ ప్లేస్ లో ఎవరిని ఆడిస్తారు ? అన్న చర్చ మరోసారి స్టార్ట్ అయ్యింది. టాపార్డర్ లో కోహ్లీ తర్వాత కీలకమైన నాలుగో ప్లేస్ కు సరైన ఆటగాడు లేకే ఇండియా కీలక మ్యాచ్ లలో ఓడిందన్న విమర్శలు వస్తున్నాయి. ఎలాగో సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్నారు.. కాబట్టి ఈ ప్లేస్‌లో యువకులకు ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ తెరమీదకు వస్తోంది. ఇక్కడ ప్రధానంగా శ్రేయస్ అయ్యర్ - రిషబ్ పంత్ - శుభ్ మాన్ గిల్ ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో నెంబర్ 4లో ఆడే ఆ లక్కీపర్సన్ ఎవరో ? చూడాలి.