ఈ మద్య కాలంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా చూసి , ఇక ఆ సమస్య తీరదు అని భావించి క్షణికావేశం లో ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. చిన్న చిన్న కారణాలకి కూడా ఆత్మహత్య చేసుకుంటుండటం గమనార్హం. తాజాగా తెలంగాణ లో ఓ టెక్కీ భర్త ఆత్మహత్య కి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు .. దీనికి కారణం తన భార్యే అంటూ ఓ సెల్ఫీ వీడియో తీసి తమ బంధువులకి పంపాడు. ఈ ఘటన సోమవారం గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే .. గజ్వేల్ పట్టణానికి చెందిన పోతిరెడ్డి జీవన్‌రెడ్డి కి గత ఏడాది డిసెంబరులో మహబూబ్‌నగర్ చెందిన కొమ్మారెడ్డి ప్రవళిక అనే యువతితో వివాహమైంది. లాక్ డౌన్ నేపథ్యంలో అతను గజ్వేల్ లో ఉంటూ ఇంటి వద్ద నుంచే కంపెనీ పనులు చేస్తున్నాడు. పెళ్లి అయిన వారం రోజులకే ప్రవళిక పుట్టింటికి వెళ్లిపోగా ఎన్నిసార్లు రమ్మని చెప్పినా ఆమె రావడం లేదు. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అందుకే తాను మీ ఇంటికి రానని చెప్పడంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జీవన్ రెడ్డి తన గదిలోకి వెళ్లి గడియ వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు తన మొబైల్ లో భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఉరి వేసుకుంటున్నానని వీడియో రికార్డు చేసి తల్లి సుందరి, ఇతర బంధువులకు పంపించాడు. ఈ వీడియోను చూసిన తల్లి వెంటనే బంధువుల సాయంతో తలుపును పగులగొట్టి గదిలోకి వెళ్లగా ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించిన జీవన్ రెడ్డిని కిందకు దింపి గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తల్లి సుందరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.