హైదరాబాద్: తీన్మార్ మల్లన్న జైలు నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీలో చేరబోతున్నారని క్యూ న్యూస్ టీం ప్రకటించింది. ఇక ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వెంటనే కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మల్లన్నను జైలు నుంచి బయటపడేసేందుకు ఆయన సతీమణి మాతమ్మ తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, తన భర్తపై అక్రమ కేసులు పెట్టి జైలు పంపారని, ఆయనను విడుదల చేయాలని ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షాకు బీజేపీ జాతీయ అధక్షుడు నడ్డాకు లేఖలు రాశారు. ఆమె కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడం... మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు క్యూ న్యూస్ టీం ప్రకటించడం అన్నీ ఒకే రోజు జరిగాయి.
ఇందులోభాగంగానే మాతమ్మ ఆదివారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. అమిత్‌షాకు ఓ విజ్ఞాపన పత్రాన్ని కూడా అందించారు. మల్లన్న పెట్టిన కేసుల వివరాలను కేంద్రమంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతోందని వాపోయారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే.. మరోకేసు పెడుతూ మల్లన్న జైలు నుంచి విడుదల కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తన భర్తపై 35 కేసులు నమోదు చేశారని తెలిపారు.
జ్యోతిష్యుడు లక్ష్మికాంత శర్మ పెట్టిన కేసులో మల్లన్న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వివిధ పోలీస్‌స్టేషన్‌లో నమోదయిన 35 కేసుల్లో మల్లన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు.మల్లన్న అరెస్ట్ తర్వాత తన ఆఫీస్‌పై పోలీసులు సోదాలు చేశారు. పలు కీలకమైన డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని క్యూ న్యూస్ సిబ్బంది చెబుతున్నారు. మల్లన్నపై ప్రభుత్వం చాలా రోజుల నుంచి కక్ష కట్టిందని అవకాశం రాగానే ఆయన కేసులు పెట్టారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మల్లన్న జైలు నుంచి విడుదలైన తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి కాషాయ పార్టీలో చేరుతారని చెబుతున్నారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత కూడా మల్లన్న తెలంగాణ ప్రభుత్వం ఇదే దూకుడు ప్రదర్శిస్తారా? లేక ఆచితూచి అడుగులు వేస్తారనే అనేదానిపై చర్చ జరుగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగి.. ఆయన బీజేపీలో చేరితే ఆ పార్టీ సిద్ధాంతాలతో రాజీ పడతారా లేదా అనేది తేలాల్చి ఉంది.