ఆర్ ఎస్ ఎస్‌ కు పోటీగా డీఎస్ ఎస్‌!

Update: 2017-04-03 11:33 GMT
హిందూ సిద్దాంతాల‌కు మ‌ద్ద‌తుగా ఉన్న రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్‌)కు పోటీగా ధ‌ర్మ‌నిరుపేక్ష (సెక్యుల‌ర్‌) సేవ‌క్ సంఘ్ (డీఎస్సెస్‌) ఏర్పాటైంది. దీనిని ఏర్పాటు చేసింది ఎవ‌రో కాదు.. బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు - ప్ర‌స్తుత ఆరోగ్య మంత్రి తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్‌. ఆర్ ఎస్ ఎస్ చేసే అరాచ‌కాల‌ను అడ్డుకోవ‌డ‌మే ఈ డీఎస్ ఎస్ ప‌ని అని తేజ్ ప్ర‌తాప్ స్ప‌ష్టంచేశారు. `దేశంలో ఆర్ ఎస్ ఎస్‌ మ‌తోన్మాదాన్ని పెంచి పోషిస్తోంది. త‌మ విభ‌జ‌న భావ‌జాలాన్ని వ్యాపింప‌జేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. దానిని డీఎస్ ఎస్‌ అడ్డుకుంటుంది` అని తేజ్ ప్ర‌తాప్ అన్నారు. ఇది కేవ‌లం ట్రైల‌రే అని, అస‌లు సినిమా మిగిలే ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

డీఎస్ ఎస్‌ ను శాంతి-స్నేహ‌బంధం పెంపొందించ‌డానికి ఏర్పాటుచేశామ‌ని తేజ్ ప్రతాప్ యాద‌వ్ తెలిపారు. యూపీ సీఎం ఏర్పాటుచేసిన హిందు యువ వాహినిలాంటి సంస్థ‌లు బీహార్‌లో అడుగుపెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని, వాటిని డీఎస్ఎస్‌ అడ్డుకుంటుంద‌ని తేజ్ ప్ర‌తాప్ తెలిపారు. దీనిపై బీజేపీ నేత సుశీల్‌ కుమార్ మోడీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తులో తేజ్ ప్ర‌తాప్ ఆర్ ఎస్ ఎస్‌ లో చేరి అది ఎలా ప‌నిచేస్తుందో చూడాల‌ని స‌ల‌హా ఇచ్చారు. అయితే సుశీల్‌కు తేజ్ ప్ర‌తాప్ కౌంటర్ ఇచ్చారు. స‌గం ప్యాంట్లు వేసుకొనే వారికి మెద‌డు కూడా స‌గ‌మే ఉంటుంద‌ని తేజ్ ప్ర‌తాప్ ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News