1000 కి.మీలు నడిచాడు.. సౌండ్ లేదు.. అట్టర్ ఫ్లాప్ నా?

Update: 2022-08-18 08:20 GMT
తెలంగాణ బీజేపీ చీఫ్ 'బండి సంజయ్' పాదయాత్ర అప్పుడే 1000 కి.మీలు పూర్తి చేసుకుందట.. మరి ఆ మాత్రం కూడా ప్రజల్లో సౌండ్ లేకుండా పోయింది. అస్సలు చర్చనే జరగడం లేదు. మీడియాలో హైప్ లేదు. అస్సలు పట్టించుకునే వారే లేనట్టుగా ఈ పాదయాత్ర సా...గుతోంది..

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ బుధవారం జనగాం జిల్లా పాలకుర్తి మండలం అప్పిరెడ్డిపల్లె గ్రామంలోకి పాదయాత్ర 1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు.ప్రజాసంగ్రామ యాత్రలో మూడు విడతలుగా 84 రోజుల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి వచ్చిన సంజయ్ మధ్యాహ్నం అప్పిరెడ్డిపల్లెలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను పటాకులు పేల్చడం, 1,000 బెలూన్లు విడుదల చేయడం, డప్పులు కొట్టడం, బాకాలు ఊదడం నడుమ ఆవిష్కరించారు. .

అయితే 1000 కి.మీలు పూర్తైన కూడా బండి పాదయాత్రలో అస్సలు హైప్ లేకుండా పోయింది. ఇటు మీడియాలో.. అటు ప్రజల్లో ఆ ఉత్సాహం అన్నదే లేకుండా తయారైంది.

1000 కి.మీలు నడిచాడు అంట అని అందరూ నిట్టూర్చడమే కానీ బండిసంజయ్ విషయంలో పాజిటివ్ యాంగిల్ లు మాత్రం అస్సలు రావడం లేదట..పాదయాత్ర చేస్తున్నాడు అనే  విషయమే రాష్ట్ర ప్రజలకు తెలియదు.. అట్టర్ ఫ్లాప్ షో అని పలువురు విశ్లేషకులు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు.

మొదటి దశ పాదయాత్ర ఆగస్టు 28, 2021న హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని భాగ్యలక్షి ఆలయం వద్ద ప్రారంభమై, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో బహిరంగ సభతో ముగిసింది. జోగులాంబ-గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం వద్ద ప్రారంభమై, మే 14న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బహిరంగ సభతో ముగిసింది.  

కొనసాగుతున్న మూడో దశ పాదయాత్ర ఆగస్టు 2న యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయం వద్ద ప్రారంభమైంది.కొనసాగుతున్న మూడో దశ పాదయాత్ర ఆగస్టు 2న యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయం వద్ద ప్రారంభమైంది. ఇన్నిరోజులు సాగుతున్నా బండి సంజయ్ పాదయాత్రలో ఆ ఊపు లేకుండా పోయింది. అదే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ లు చేసినప్పుడు జన నీరాజనం పలుకారు. జనాలు పోటెత్తారు. ఇక షర్మిల పాదయాత్రకు బాగానే హైప్ వచ్చారు. కానీ మన బండి సంజయ్ పాదయాత్ర చేస్తే నిరసన సెగలు వస్తున్నాయి. చాలా మంది అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఘర్షణ పూరిత వాతావరణం నడుస్తోంది.

-వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ లకు అధికారం.. 'బండి' లోపం ఇదే!

ఉమ్మడి ఏపీలో పాదయాత్ర పవర్ ఫుల్ యాత్ర. అది చేసిన వారికి అధికారం ప్రాప్తించింది. వైఎస్ఆర్,చంద్రబాబు, జగన్ లు మొత్తం పార్టీ శ్రేణులన్నింటిని సమాయత్తం చేస్తూ అందరినీ దానిపైనే ఫోకస్ చేశారు. ప్రజలను మళ్లించారు. అందుకే అవి విజయవంతం అయ్యాయి. ఆఖరుకు షర్మిల కూడా పట్టుదలతో చేస్తోంది.కానీ బండి సంజయ్ పాదయాత్రకు బీజేపీలోనే స్పందన లేదు. కిషన్ రెడ్డి సహా ఇతర బీజేపీ అగ్రనేతలు బండి పాదయాత్రను వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.యువత, స్థానిక నాయకులు తప్ప పెద్ద లీడర్లు ఎవరూ బండి పాదయాత్ర వైపు వెళ్లడం లేదు. కలిసి నడవడం లేదు. ఒంటరిగా.. దూకుడుగా బండి వెళ్లడం మైనస్ అంటున్నారు. అందరినీ ఏకతాటి పైకి తీసుకురాకుండా ఒంటరిగా తన మానాన తను వెళ్లడమే మైప్ రావడానికి కారణంగా చెబుతున్నారు.
 
-బండి కంటే షర్మిల బెటర్..

ఇక తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన షర్మిల పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆమె ప్రజాదరణ దక్కుతోంది. అదే బండి సంజయ్ కు నిరసన సెగ తగులుతోంది. ఆయన మాటలు, చేష్టలతో విద్వేష రాజకీయం చేస్తుండడంతో ప్రతీ గ్రామంలోనూ ఎవరూ ఒకరు నిలదీస్తున్న పరిస్థితి. పార్టీని కలుపుకోకుండా ఒంటరిగా వెళుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది.  చాలామంది తెలంగాణలో బండి సంజయ్ కంటే కూడా షర్మిల పాదయాత్ర బెటర్ అని.. ఈయన కంటే ఆమెకే ఎక్కువ పాపులారిటీ వస్తోందని అంటున్నారు. 1000 కి.మీలు నడిచాడని అందరూ అంటున్నా ప్రజల్లో ఆమాత్రం కూడా ఆయన పట్ల సౌండ్ లేకపోవడం గమనార్హం. దీంతో బండి సంజయ్ గుడ్డెద్దు చేల్లో పడ్డ చందంగా ఆయన పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ నా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Tags:    

Similar News