గతంలో పోలిస్తే.. ఇటీవల కాలంలో యమా యాక్టివ్ గా ఉంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వరుస పెట్టి రివ్యూలు నిర్వహించటం.. పలు నిర్ణయాల్ని పెండింగ్ పెట్టకుండా క్లియర్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆయన వర్గల్ మండలం నెంటూర్ గ్రామానికి వెళ్లిన ఆయన అక్కడి కూరగాయల మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడారు.
మార్కెట్లో తనిఖీలు నిర్వహించిన వేళ.. ముందుగా నెంటూరుకుచెందిన ఆలుగడ్డ రైతు కిచ్చుగారి స్వామిని పలుకరించారు. ఆలుగడ్డ రేటు ఎలా ఉంది? పంట పెట్టుబడి.. దిగుబడి.. మార్కెట్ సౌకర్యాలపై పలు ప్రశ్నలు సంధించారు. పది రోజుల క్రితం పది కేజీల ఆలుగడ్డ రూ.150నుంచి రూ.200 వరకు ధర పలికినట్లు చెప్పారు. తాజాగా మాత్రం పది కేజీలు రూ.100 మాత్రమే ధర పలుకుతున్నట్లు వెల్లడించారు. దీంతో.. తమకు పెట్టుబడి కూడా రావట్లేదన్నారు.
మరో రైతు మల్లేశాన్ని పలుకరించిన ముఖ్యమంత్రి.. మార్కెట్ లో కూరగాయల ధరలు తగ్గటానికి కారణం ఏమిటంటూ ప్రశ్నించారు. గతంలో ఏపీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసేవారని.. ఇప్పుడు రాకపోవటంతో ధరలు తగ్గినట్లుగా పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీ అనంతరం అధికారులతో రివ్యూ పెట్టిన ముఖ్యమంత్రి.. ఏజెంట్ల కమిషన్ ను ఎనిమిది నుంచి నాలుగు శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా అంతకు మించిన కమిషన్ తీసుకుంటే వారి లైసెన్సు క్యాన్సిల్ చేయాలన్నారు. వంటిమామిడి మార్కెట్ యార్డును దేశానికే ఆదర్శంగా డెవలప్ చేసి చూపుతామన్నారు. మార్కెట్ విస్తీర్ణాన్ని పద్నాలుగు ఎకరాలకు పెంచి డెవలప్ చేయాలన్నారు.
ప్రస్తుతం 30వేల ఎకరాల్లో సాగయ్యే ఆలుగడ్డ పంటను మరో 50వేల ఎకరాల్లో ఆలుగడ్డ.. ఇతర కూరగాయలు నిల్వ చేసేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజీల్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆకస్మిక తనిఖీల్లో రైతుల సమస్యల కంటే కూడా ఆలుగడ్డకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆలుగడ్డ పంటపై సీఎం ప్రత్యేకంగా ఫోకస్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.