ఏపీ నీళ్లు తరలిస్తోంది.. తెలంగాణ మళ్లీ ఫిర్యాదు

Update: 2021-08-12 13:30 GMT
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఇప్పటికే కృష్ణా నది నీళ్లను ఇష్టానుసారం వృథా చేసి ఏపీతో కయ్యానికి కాలు దువ్వింది తెలంగాణ సర్కార్. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో దిగివచ్చింది.  తాజాగా మరోసారి ఏపీపై కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది.

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. కృష్ణ జలాల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే అడ్డుకోవాలని కోరింది.

మచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల హెడ్ రెగ్యులరేటరీ నుంచి ఏపీ నీటి తరలింపును ఆపాల్సిందిగా కృష్ణా నది యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. సరైన కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టు ముందు భాగం నుంచి అక్రమంగా కేసీ కెనాల్ కు ఏపీ నీటిని మళ్లించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.

అనుమతి లేని ప్రాజెక్టుల ద్వారా తరలింపును అడ్డుకోవాలని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి తరలింపు ఆపాలని లేఖలో కోరారు.

కేసీ కెనాల్ ద్వారా ఏపీకి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని తెలంగాణ సర్కార్ పేర్కొంది. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని.. దానిని ఎలాగైనా ఆపాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ సర్కార్ లేఖ రాసింది.

ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టులను ఏపీ కడుతోందని.. వాటి నుంచి నీటి తరలింపును అడ్డుకోవాలని లేఖలో కోరారు. కేసీఆర్ కెనాల్ కు తుంగభద్ర నుంచినీటిని విడుదల చేస్తున్నారని.. అలాంటప్పుడు ఈ మూడింటి ద్వారా నీటిని తరలించడం ఎందుకని లేఖలో ప్రశ్నించింది.
Tags:    

Similar News