రాజకీయ నాయకులకు ఉండే లాజిక్ మరెవరికీ ఉండదేమో. వారు తలుచుకోవాలే కానీ..రెండు పొంతన లేని అంశాల్ని తెరపైకి తీసుకొచ్చి.. ఒకటిగా చేసేసి.. దాన్నో చర్చగా మార్చే సత్తా వారి సొంతం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.
తన చైనా పర్యటన సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక విమానంలో చైనా వెళుతున్నారు. ఈ అంశాన్ని తెలంగాణకాంగ్రెస్ నేత.. ఒకప్పటి టీఆర్ ఎస్ పార్టీకి దన్నుగా ఉన్న దాసోజు శ్రవణ్ మండిపడుతున్నారు. ఓ పక్క రాష్ట్రంలో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి.. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వారిని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని విమర్శించిన శ్రవణ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రత్యేక ఫ్టైట్లలో పర్యటించటాన్ని తప్పు పడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనలకు వెళ్లటం తప్పేం కాదని.. కానీ.. ప్రత్యేక విమానాల్లో వెళ్లాల్సిన అవసరం లేదని విమర్శిస్తున్నారు. ఓపక్క రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే పట్టించుకోని కేసీఆర్.. మరోవైపు మాత్రం ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రైతుల్ని ఆదుకోవాల్సిందిపోయి.. అనవసరంగా ప్రత్యేక విమానాల్లో వెళుతూ డబ్బును వృధా చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఏమాటకు ఆ మాటే చెప్పాలంటే శ్రవణ్ చేసిన విమర్శల కంటే ఆయన తెలివితేటల్ని అభినందించాలి. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల వ్యవహారం రగులుతున్న సందర్భంలోనే.. త్వరలో వెళ్లనున్న కేసీఆర్ విదేశీ పర్యటనను లింకు చేసి విమర్శలు చేసిన తీరు అందరిని ఆకట్టుకునేలా ఉండటంతో పాటు.. కేసీఆర్ అనవసరంగా ఖర్చులు ఎక్కువ చేస్తున్నారన్న భావన కలిగించటంలో విజయవంతం అయ్యారని చెప్పొచ్చు.