ఇటీవలి కాలంలో తెలంగాణలో ఒకింత బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ 2019కి కార్యాచరణ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ పార్టీల నేతలను తమ గూటికి చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దూకుడుగానే వ్యవహరిస్తోంది. అయితే ఇలా సమష్టి కార్యాచరణతో పాటుగా హస్తం పార్టీ నేతలు సొంతంగా తమ ప్రయోజనం కూడా చూసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ పరంగా రాబోయే ఎన్నికల్లో తమ వారసులను దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వారు పార్టీ రథసారథులు అయిన సోనియాగాంధీ - రాహుల్ గాంధీని స్పూర్తిగా తీసుకోవడం గమనార్హం.
గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ రంగంలోకి దిగడం - ఇటీవల జాతీయ అధ్యక్ష పదవి చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భావి రాజకీయాల్లో తమ వారసులను దింపేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు ఇలా తమ వాళ్ల ఎంట్రీ ఇప్పించగా మరికొందరు వరుసలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఉత్తమ్ పోటీ చేయడంతో పాటుగా ఆయన సతీమణి పద్మా సైతం బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ సైతం బరిలోకి దిగారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా..ఆయన సోదరుడైన రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంటు నుంచి ఓటమి పాలయ్యారు. అయితే తర్వాతి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించారు.
మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు సైతం ఇదే రీతిలో వారసత్వంతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన వారయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు - మాజీ మంత్రులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి - రాంరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాతో పాటుగా నల్లగొండలో తమ ముద్ర వేసుకున్నారు. 2014 ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నుంచి వెంకటరెడ్డి గెలుపొందగా...అనారోగ్యంతో మరణించారు.అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో వెంకట్ రెడ్డి సతీమణిని ప్రస్తుత మంత్రి తుమ్మలనాగేశ్వర్ రావు ఓడించారు. వెంకట్ రెడ్డి సోదరుడైన రాంరెడ్డి దామోదర్ రెడ్డి నల్లగొండ జిల్లా నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు వారసత్వ రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తన అన్న వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన మల్లు అనంతరాములు సోదరుల్లో మల్లు భట్టివిక్రమార్క ఒకరు. మల్లు రవి మరొకరు. ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నారు. మల్లురవి గతంలో నాగర్ కర్నూల్ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
ఇదే జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ డీకే అరుణ. డీకే అరుణ - ఆమె సోదరుడు రామ్మోహన్ రెడ్డి టికెట్లు పొంది 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. మాజీమంత్రి డి.కె.అరుణ కాంగ్రెస్‌లోనే ఉండగా ఆమె సోదరుడు రామ్మోహన్ రెడ్డి మాత్రం టీఆర్ ఎస్ లో చేరారు.తెలుగుదేశం పార్టీ ముఖ్యనేల్లో ఒకరిగా ఉండి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పటోళ్ల ఇంద్రారెడ్డి - ఆయన భార్య సబితా సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి గత ఎన్నికల్లోనే చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. మరో దఫా ఆయన టికెట్ కోసం ట్రై చేస్తున్నారు.
ఇక రాబోయే ఎన్నికల్లో వారసత్వం రూపంలో ఎంట్రీ ఇప్పించే నాయకుల జాబితా పెద్దదే ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత - అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన కుందూరు జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ స్థానం నుంచి తన కుమారుడు రఘువీర్ రెడ్డికి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే జానారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకొని కుమారుడిని రంగంలోకి దింపవచ్చని చెప్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు నరోత్తమ్ రెడ్డి రంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాజీమంత్రి డీకే అరుణ కూతురు స్నిగ్ధ వచ్చే ఎన్నికల్లో తన భవితవ్యాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య 2014 ఎన్నిక సమయంలోనే తన కోడలు వైశాలిని జిల్లా రాజకీయాల్లో భాగస్వామిని చేశారు. అప్పుడు భువనగిరి పార్లమెంటుపై కన్నేసినప్పటికీ..కుదరలేదు.అయినప్పటికీ కోడలిని వారసురాలిగా ఆయన తీర్చిదిద్దుతున్నారు.
రాజధాని హైదరాబాద్ సమీపంలోని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు సైతం ఇదే డిమాండ్ ఉంది. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మనుమడు, మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు మర్రి ఆదిత్యా రెడ్డితోపాటు మాజీ ఎంపీ ఎం.అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సిద్ధిపేట ఎస్సీ రిజర్వుడ్ తర్వాత మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పలుసార్లు ఎంపీగా ఎన్నికైన సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్ - జహీరాబాద్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి కూతురు మేఘనారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. స్థూలంగా రాబోయే ఎన్నికల్లో ఎందరో యువనేతలను తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో చూడవచ్చని అంటున్నారు.