కేసీఆర్ సర్కారు పాలసీని గవర్నర్ తప్పు పట్టారా?

Update: 2020-06-09 05:30 GMT
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లటానికే భయపడుతున్న వేళ.. రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళ సై.. నిమ్స్ ను సందర్శించటం సంచలనంగా మారింది ఇటీవల కాలంలో నిమ్స్ కు చెందిన వైద్యులు.. వైద్య సిబ్బంది పలువురికి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వారిలో ఆత్మస్థైరాన్ని  పెంచేందుకు తాను నిమ్స్ కు వచ్చినట్లు పేర్కొన్నారు. స్వతహాగా డాక్టర్ అయిన తనకు.. వైరస్ మీద పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు పరామర్శించేందుకు తాను వచ్చినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా నిమ్స్ వైద్య సిబ్బందితో మాట్లాడారు. పాజిటివ్ అయిన వైద్యులు.. వైద్య సిబ్బందికి అందుతున్న వైద్య సాయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న విధానం పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. చాలా రాష్ట్రాల్లో మాదిరి మహమ్మారి నిర్దారణ పరీక్షల్ని చేయకుండా పరిమితంగా మాత్రమే చేస్తోంది తెలంగాణ సర్కారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ తమ తీరు మార్చుకోవటానికి కేసీఆర్ సర్కారు ఇష్ట పడటం లేదు.

ఇలాంటివేళ.. గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తున్న విధానాల్లో మరిన్ని మార్పులు అవసరమన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నారని.. వాటి సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

సలహా ఇస్తున్నట్లు వ్యాఖ్యలు చేసిన గవర్నర్.. పరోక్షంగా కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న పరీక్షా విధానాన్ని వేలెత్తి చూపేలా ఉందని చెబుతున్నారు. నిర్దారణ పరీక్షల్ని పెంచాలని పలువురు చెబుతున్న వేళ.. అందుకు తగ్గట్లే గవర్నర్ నోటి నుంచి వచ్చిన మాట కేసీఆర్ సర్కారు తీరును తప్పు పడుతూనే.. అందుకు పరిష్కారంగా సలహా చెప్పినట్లే అవుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. గవర్నర్ నోటి నుంచి వచ్చిన సలహాపై సీఎం కేసీఆర్ ఏ తీరులో స్పందిస్తారో చూడాలి?
Tags:    

Similar News