అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు అనుకోవాలే కానీ కొండ మీద కోతి అయినా ఇట్టే దిగి వస్తుంది. అధికారంలో చేతిలో ఉంటే అలానే ఉంటుంది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏళ్ల తరబడి పోరాడినా ప్రయోజనం కనిపిందు కానీ.. అధికారంలో ఉన్న వారు అనుకున్నంతనే వాయు వేగంతో మార్పులు చోటు చేసుకుంటాయి. మొన్నీ మధ్యన (అదేనండి ఆదివారం) నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్ మహానగరంలో ఫేమస్ అయిన నెక్లెస్ రోడ్డు పేరును పివి. నరసింహారావు మార్గ్ గా మార్చాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే.
ఇటీవల కాలంలో పీవీని భుజాన వేసుకొని.. ఆయనకు తాము తప్పించి మరెవరూ సరైన గౌరవ మర్యాదలు ఇవ్వలేదన్న విషయాన్ని అదే పనిగా నిరూపించే ప్రయత్నంలో ఉన్న కేసీఆర్.. తాజాగా నెక్లెస్ రోడ్డు పేరును మార్చేయటం ద్వారా.. తమకున్న కమిట్ మెంట్ ను చెప్పే ప్రయత్నం చేశారు. పేరు మార్చాలన్న తన నిర్ణయాన్ని మూడు రోజుల వ్యవధిలో అమలు చేయటం గమనార్హం.
తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం వేళ.. నెక్లెస్ రోడ్డును పివి నరసింహారావు మార్గ్ గా పేరు మార్చేస్తూ.. బోర్డులు ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్డును ఏర్పాటు చేసిన 23 ఏళ్ల తర్వాత దాని పేరు తాజాగా మారిపోయింది. ఇక నుంచి పివి నరసింహారావు మార్గ్ అంటే.. నెక్లెస్ రోడ్డు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి సుమా.