తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అయితే భావోద్వేగం లేకుంటే ఆంధ్రోళ్లు అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడేసే తెలంగాణ అధికారపక్షానికి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి. ఎందుంటే ఇంతకాలం వారిని నిలదీసే వారు అయితే గియితే విపక్షాలే తప్పించి మరొక వర్గం ఉండేది కాదు.
ఇక.. విపక్షాల్లో ఒక్కొక్కరిది ఒక్కో వీక్‌పాయింట్ ఉండనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు విప్పితే.. చేయాల్సిన దరిద్రం చేసేసి.. ఇప్పుడు తాపీగా మాట్లాడతారా? గత పదేళ్లలో వ్యవస్థల్ని ఎంత నాశనం చేశారో అంత చేసేసి.. ఇప్పుడు నీతులు చెబుతారా? అంటూ ఎదురుదాడికి దిగితే వారి నుంచి సౌండ్ రాని పరిస్థితి. ఇక.. మిగిలిన టీడీపీని తిట్టాల్సి వస్తే.. సీమాంధ్ర పార్టీ తెలంగాణలో ఎందుకు? చంద్రబాబుకు గులాంగిరి చేసే మీరు.. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల గురించి మాట్లాడతారా? అంటే.. తమ్ముళ్లు ఎంత చెప్పినా జనాలకు నచ్చే పరిస్థితి ఉండదు.
ఇక.. మిగిలిన బీజేపీ.. సీపీఎం..సీపీఐ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లెక్కలో వేసుకోవాల్సినవి కానే కాదు. ఇలా విపక్షాల్ని తమకు తోచిన రీతిలో బంతాట ఆడుకునే టీఆర్‌ఎస్ నేతలకు ఇప్పుడు ప్రజాగ్రహం.. ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకత తెగ ఇబ్బంది పెట్టేస్తోంది.
తాజాగా గ్రేటర్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల విషయాన్నే తీసుకుందాం. వారు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. వారి డిమాండ్ల గురించి మాట్లాడని అధికారపక్షం.. వారిని సమ్మె నుంచి విరమించుకునేలా చేయటానికి కిందామీదా పడుతున్నారు. ఊహించని విధంగా.. గుర్తింపు లేని ఒక సంఘం వారి చేత సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన ఇప్పించి కాసేపు హడావుడి చేశారు.
అథికారపక్షం చేస్తున్న చేష్టల్ని చూస్తున్న కార్మిక సంఘాలు ఉడికిపోతున్నారు. తమ మధ్య పుల్లలు పెట్టేలా కుట్రలు చేస్తారా అంటూ మండి పడటమే కాదు.. సదరు సంఘానికి అస్సలు గుర్తింపు లేదని.. దాంతో తమకు సంబంధం లేదని తేల్చటమే కాదు.. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు.
ఒకప్పుడు కార్మిక సంఘం నేతగా వ్యవహరించి.. ప్రస్తుతం తెలంగాణ హోంమంత్రిగా వ్యవహరిస్తున్న నాయిని నర్సింహారెడ్డి.. సమ్మెను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ మధ్య ఐక్యతను దెబ్బ తీసేలా కుట్రలు చేస్తున్నారంటూ వాపోతున్నారు. తమ తెలివితేటలతో విపక్షాల్ని ఉక్కిరిబిక్కిరి చేసే తెలంగాణ అధికారపక్షం.. తాజాగా పారిశుద్ధ్య కార్మికుల ముందు మాత్రం తమ తెలివితేటలు పారకపోవటం ఇబ్బంది కలిగించే అంశమే.