తెలంగాణ రాష్ర్టం నిధుల వేటలో పడింది. ఇందుకోసం రాజకీయ లెక్కలు కూడా వేసుకుంటూ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కేంద్రంపై వ్యూహాత్మక ఒత్తిడి పెంచుతోంది. తెలంగాణ రాష్ట్రానికి 30వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి - ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సహా ఇతర ఉన్నతాధికారుల బృందం అరవింద్ పనగరియాతో ఢిల్లీలో సమావేశమై తెలంగాణకు సంబంధించిన అర్థికాంశాలు, విభజన చట్టంలోని అమలు చేయాల్సిన అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణకు 30వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రతిపాదనల చిట్టాను నీతి అయోగ్ ముందు ఉంచారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన 700 కోట్ల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు కేంద్రం నుంచి రావాల్సిన నాలుగు వందల కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. గిరిజనులకు అత్యంత ముఖ్యమైన మేడారం జాతరతోపాటు కృష్ణా పుష్కరాల నిర్వహణకు కేంద్రం నిధులు కేటాయించాలని విన్నవించారు. ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటున్న నాలుగు జిల్లాలకు నాలుగు వందల కోట్లు కేటాయించాలన్నారు. సీఎస్ టీ నష్టపరిహారం కింద రాష్ట్రానికి ఏడు వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, ఇంతవరకు కేవలం 90 కోట్లు మాత్రమే విడుదల చేశారని మిగతా మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 13వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు కేటాయించిన 788 కోట్లు విడుదల చేయాలని నొక్కిచెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం నీతి అయోగ్ తో సమావేశం అవడం, పెద్ద ఎత్తున ప్రతిపాదనలు ఉంచడం వెనుక ప్రజాప్రయోజనాలతో పాటు పొలిటికల్ ఎజెండా కూడా ఉందని చెప్తున్నారు. నీతి అయోగ్ చైర్మన్ గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ఇప్పటికే తెలంగాణ పట్ల ప్రధానమంత్రి వివక్ష చూపిస్తున్నారని విమర్శలు చేస్తున్న టీఆర్ ఎస్ పార్టీ ఈ వినతులకు కేంద్రం సరైన రీతిలో స్పందించి పక్షంలో కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపించే అవకాశం ఉంటుంది. ప్రతిపాదనలన్నింటికీ ఓకే చేసి నిధులు మంజూరు చేస్తే...రాష్ర్టంలో అభివృద్ధి చేసేందుకు వీలు దొరుకుతుంది. మొత్తంగా ఎలాగైన రాష్ర్ట ప్రభుత్వానికి మేలు...నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇరకాటం తప్పదని అంటున్నారు.