షాపుకు వెళతాం. ఫలానా వస్తువ కావాలని అడుగుతాం.షాపు అతను చెప్పినట్లు డబ్బులు ఇచ్చేసి వస్తాం. చాలామంది ఇలాంటి పనే చేస్తారు. మరికొందరుమాత్రం.. ఎమ్మార్పీ ఎంత ఉంది? ఫలానా షాపు వాడు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? మరో షాపు అతను మరెంత ఇస్తున్నాడంటూ ఆరా తీసి మరీ డబ్బులు చెల్లిస్తుంటారు. అలాంటి ఒక పెద్ద మనిషి కాస్త సూక్ష్మంగా చెక్ చేసిన వేళ.. బడా కంపెనీ చేసిన తప్పు ఒకటి బయటకు వచ్చింది. మీరు తప్పు చేశారన్నప్పుడు స్పందించి చెంపలేసుకుంటే సరిపోయేది. అందుకు భిన్నంగా ఎలాంటి రిప్లై ఇవ్వకపోవటంతో.. కోర్టు ఫైన్ వేసే వరకు వెళ్లింది.
న్యాయవాదిగా పని చేస్తున్న నాగేందర్.. 2019 ఏప్రిల్ ఏడున సంగారెడ్డిలోని ఒక మాల్ లో 150 గ్రాముల కాల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ రూ.92కు కొనుగోలు చేశారు. దీంతో పాటు 20 గ్రాముల కోల్గోట్ మాక్స్ రూ.10 చొప్పున కొనుగోలు చేశారు. పది రూపాయిలకు 20 గ్రాముల పేస్టే వస్తే.. 150 గ్రాములకు రూ.92 తీసుకోవటం ఏమిటి? లెక్కగా చూస్తే.. రూ.75కు మించి తీసుకోకూడదు కదా? అన్న సందేహం కలిగింది. ఇదే లెక్కను చెప్పి రూ.17 ఎందుకు ఎక్కువ తీసుకున్నారంటూ కోల్గోట్ సంస్థకు నోటీసులు పంపారు.
సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో సదరు న్యాయవాది సంగారెడ్డి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. కేసును విచారించిన ఫోరం అదనంగా వసూలు చేసిన రూ.17 తిరిగి ఇవ్వాలని.. వినియోగదారుడ్ని మానసికంగా క్షోభకు గురి చేసినందుకు రూ.10వేలు ఖర్చులు.. అదనంగా రూ.5వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని కోల్గోట్ సంస్థను ఆదేశించారు. ఫోరం పేర్కొన్న మొత్తాన్ని బాధితుడికి నెల రోజుల్లో చెల్లించాలన్నారు. ఈ ఉదంతాన్ని చూసినప్పుడు మార్కెట్లో మనం కొనుగోలు చేసే చాలా వస్తువుల్లో ఇలాంటి తేడాలు కనిపించే అవకాశం ఉంది. కొనే ముందు చెక్ చేసుకోవటం ద్వారా కంపెనీలు చేసే తప్పుల్ని సరిదిద్దే అవకాశం ఉంది.