కరోనా వేళ.. కార్పొరేట్ ఆసుపత్రులపై విమర్శలు.. ఆరోపణలు భారీగా రావటం తెలిసిందే. అధిక బిల్లులతో తమను వేధించారని పలువురు కంప్లైంట్లు చేశారు. నిబంధనలకు విరుద్దంగా బిల్లులు వేసినట్లుగా వాపోయారు. ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. అప్పట్లో విరంచి ఆసుపత్రిపై చర్యల కొరడా ఝుళిపించారే తప్పించి.. మిగిలిన ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తాజాగా..ప్రైవేటు ఆసుపత్రులపై బాధితులు చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందన్న విషయంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా పలు కార్పొరేట్ ఆసుపత్రులపై ఉన్న కంప్లైంట్ల ప్రస్తావన రావటమే కాదు.. వాటి పేర్లు.. ఎన్నికంప్లైంట్లు ఉన్నాయన్న విషయం బయటకు వచ్చింది.
సన్ షైన్ మీద 14.. కేర్ మీద 10.. మెడికవర్ మీద 8.. కిమ్స్ పైన 13.. విరంచి ఆసుపత్రి మీద 19 కంప్లైంట్లు వచ్చాయి. అన్నింటికి మించి సోమాజిగూడ.. సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి మీద అత్యధికంగా 33 ఫిర్యాదులు వచ్చినట్లుగా హైకోర్టు పేర్కొంటూ.. ఇన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా యశోద మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిబందనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్కన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నప్పుడు.. యశోద మీద ఎందుకు తీసుకోలేదు? యశోద అంటే ఎందుకంత ప్రేమ? అంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖను సూటిగా ప్రశ్నించింది.
హైకోర్టు ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అధికారులు.. కరోనా వేళ ప్రైవేటు ఆసుపత్రులపై 276 ఫిర్యాదులు రాగా.. వాటిల్లో 154 పరిష్కరించామని.. మరో 122 పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణలోపు పెండింగ్ లో ఉన్న 122 కంప్లైంట్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని చెబుతూ.. ఆ వివరాలను నివేదిక రూపంలో తమకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. సో.. రానున్న రోజుల్లో యశోద ఆసుపత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.