రాజకీయాల్లోకి వచ్చిన ప్రతీ నేతపై ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కేసు పెడుతూనే ఉంటారు. చాలా మంది నేతలు పలు రకాల కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుండగా.. మరికొందరు ఆర్థికపరమైన, అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు.
కోర్టులు పరిమితంగా ఉండడం.. కేసులు వేలల్లో ఉండడంతో రాజకీయ నేతలపై కేసుల విచారణలో అంతులేని జాప్యం జరుగుతోంది. రాజకీయ నేతలపై విచారణ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటోంది. ఈ జాప్యంతో రాజకీయ నేతలు ఒకటికి రెండు సార్లు సీఎంలుగా కొనసాగుతూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల విచారణకు సుప్రీంకోర్టు గతంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని కింది కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతీవారం విచారించి తేల్చాలని సూచించింది.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణను రోజువారీ జరపాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. నేటి నుంచి జగన్ తోపాటు అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వారి కేసుల విచారణను రోజువారీగా విచారించనుంది. ఈ కేసుల్లో దాఖలైన రిట్ పిటీషన్లపై రోజూ విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది.
గతంలో సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు కోరారు. ఆ పిటీసన్ తోపాటు 2012 నుంచి దాఖలైన 40 వ్యాజ్యాలు హైకోర్టు విచారణ జాబితాలో ఉన్నాయి. ఈ విచారణ మొదలు పెట్టేందుకు వారం రోజులు గడువు కావాలని జగన్ తరుఫు న్యాయవాదులు కోరారు.
అయితే ఇందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జగన్ కు షాకిచ్చింది. ప్రతిరోజు విచారణ జరుపుతామని.. అందుకు సిద్ధంగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. హెటిరో, అరబిందో కేసులతో విచారణ మొదలుపెడుతామని వెల్లడించింది. ఈ కంపెనీలకు భూ కేటాయింపుల్లో అవకతవకలు, క్విడ్ ప్రోకోపై తొలుత విచారిస్తామని తెలిపింది.