హైదరాబాద్ లోని ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న డాక్టర్లు - వైద్య సిబ్బంది కరోనా బారిన పడిన ఘటన చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఉస్మానియా హాస్పిటల్ - నిమ్స్ - పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రుల్లోని జూనియర్ డాక్టర్లు, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లకు కరోనా సోకడం కలకలం రేపింది. హైదరాబాద్ లో 31 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకడంపై హైకోర్టుల పిటిషన్ దాఖలైంది. వైద్య సిబ్బందికి సరిపడా పీపీఈ కిట్లు అందించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని... అందువల్లే డాక్టర్లకు ఇన్ఫెక్షన్ సోకిందని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇచ్చినప్పటికీ వైద్య సిబ్బందికి కరోనా ఎలా సోకిందని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై జూన్ 8 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణలో కరోనా టెస్టులను తక్కువ సంఖ్యలో చేయడంపై గతంలో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా, మృతదేహాలకు కూడా తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు, గాంధీ హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స చేస్తోన్న డాక్టర్లకు మాత్రమే ప్రభుత్వం పీపీఈ కిట్లు అందజేస్తోంది. ఔట్ పేషెంట్లు ఎక్కువగా వచ్చి వెళ్లే మిగతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లను ఇవ్వడం లేదు. రీడింగ్ రూమ్ లు - పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్స్ లోనూ పీపీఈ కిట్ల సరఫరా లేదు. ఈ వ్యవహారంపై విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. తాజాగా, హైకోర్టు ఆదేశఆలతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.