మత రాజకీయాలు చేయం.. కేటీఆర్ హాట్ కామెంట్స్

Update: 2022-04-18 05:27 GMT
టీఆర్ఎస్ ప్రధాన టార్గెట్ గా మారిన బీజేపీకి మతమే బలం. హిందుత్వ రాజకీయాన్ని వారు చేపట్టి ప్రత్యర్థులను ఇరుకునపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ మత సహానాన్ని పాటిస్తూ బీజేపీకి చెక్ పెట్టే రాజకీయాన్ని మంత్రి కేటీఆర్ బయటకు తీశారు. ఈ క్రమంలోనే మూడు మతాలను గౌరవిస్తూ ముందుకెళ్లాలని.. బీజేపీ గుప్పిట్లో చిక్కకూడదని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త సచివాలయంలో మూడింటిని నిర్మిస్తూ బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు కేటీఆర్.

బీజేపీపై విమర్శలకు ఎక్కుపెట్టారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు తమ ప్రభుత్వం మత సహనాన్ని పాటిస్తుందని కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో మత రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. మత సామరస్యానికి కట్టుబడి ఉంటామన్నారు. కొత్త నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయంలో మందిరంతోపాటు మసీద్, చర్చిని నిర్మిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పలు సంచలన విషయాలు వెల్లడించారు.

సచివాలయంలో మందిర నిర్మాణంపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తాము మతం ముసుగులో రాజకీయాలు చేయమని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని మతాలను సమానంగా చూస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.

రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో గతంలో ఉన్న మసీదు, ఆలయం, చర్చిలను పాత భవనాల కూల్చివేత సందర్భంగా తొలగించారని.. వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడుతామని గతంలోనే ప్రకటించామన్నారు. ఒక్కో ప్రార్థనా మందిరానికి 1500 చదరపు గజాల స్తలాన్ని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.

సచివాలయ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయని.. వచ్చే దసరా నాటికి కొత్త సచివాలయ భవనాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలన్నారు.

మొత్తం 1250 మంది కార్మికులు 24 గంటల పాటు మూడు షిఫ్ట్ లలో పనులు కొనసాగిస్తున్నారని తెలిపారు.
Tags:    

Similar News