బ్రేకింగ్ : మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

Update: 2020-08-08 11:10 GMT
తెలంగాణ లో క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్న రాజ‌కీయ నాయ‌కుల సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతుంది. ఇప్ప‌టికే ప‌లువురు తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీక‌ర్, ఎమ్మెల్యేలు, ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు ఇలా చాలా మంది కోవిడ్ బారిన ప‌డ్డారు. కాగా వీరిలో ప‌లువురు నాయ‌కులు క‌రోనా బారి నుంచి ఇప్ప‌టికే కోలుకున్నారు కూడా. అయితే సామాన్యుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా కరోనా సోకుతుండటంతో ప్రజలు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. గత ఆదివారం మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ ‌గా నిర్ధారణ కావడంతో , వైద్యుల సలహా మేరకు మంత్రి మల్లారెడ్డి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. దీనితో ఇక‌, మ‌ల్లారెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు, ఆయ‌న‌కు స‌న్నిహితంగా మెలిగిన‌వారిని గుర్తించి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఇకపోతే , తాజాగా నేడు ఎల్‌బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో స‌హా ఆయ‌న భార్య‌, కుమారుల‌కు కూడా కోవిడ్ సోకిన విష‌యం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మృతుల సంఖ్య 615కి పెరిగింది. కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 54,330కి చేరింది. ప్రస్తుతం 21417 మంది చికిత్స పొందుతున్నారు.
Tags:    

Similar News