తెలంగాణ మున్సిపోల్స్: దొంగఓట్లు, ఘర్షణ

Update: 2020-01-22 10:09 GMT
తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రం లో మొత్తం 7961 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. వార్డులు, డివిజన్ల కు కలిపి మొత్తం 12898 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అవుతోంది.

ఉదయం 7గంటలకే మున్సిపాలిటీల్లో  పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల కు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకూ 56శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.

పెద్ద అంబర్ పేటలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను పట్టుకొని కాంగ్రెస్ నేతలు చితక బాదారు. జగిత్యాల లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వికారాబాద్ లోని తాండూర్ లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. నర్సాపూర్ , రంగారెడ్డి జిల్లా జల్ పల్లిలో ఘర్షణ చోటు చేసుకుంది.

నిజామాబాద్ లో 10 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని పోలీసులు తెలిపారు. డిచ్ పల్లి నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారని పోలీసులు గుర్తించారు.
Tags:    

Similar News