తెలంగాణ రాష్ట్రం లో పుర ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. లెక్కలు ఒక కొలిక్కి రావటమే కాదు.. ఫలితాలు వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే.. డబుల్ డిజిట్ దాటని తీరుకు భిన్నంగా రిజల్ట్స్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు ఏకంగా 113 స్థానాల్లో గులాబీ జెండా ఎగురనుంది.
ఎలా కుదిరితే అలా అన్న రీతిలో.. ఎక్స్ అఫీషియో సభ్యుల అవసరం తో కార్పొరేషన్.. మున్సిపాలిటీల్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటే ఆ రూట్లో పావులు కదిపిన గులాబీ దళం.. ఇతర పార్టీల్లోని వారిని ఆపరేషన్ ఆకర్ష్ తో చీల్చేయటం ద్వారా.. పదవుల ఎర చూపించటం ద్వారా నూట పదమూడు చోట్ల అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది.
రాష్ట్రం మొత్తమ్మీదా 120 మున్సిపాలిటీలు.. తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్.. డిప్యూటీ మేయర్.. మున్సిపల్ ఛైర్ పర్సన్.. వైస్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన సమావేశం ఈ ఉదయం పదకొండు గంటలకు సాగనుంది.
దాదాపు గంటన్నర పాటు సభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత మేయర్.. డిప్యూటీ మేయర్.. మున్సిపల్ ఛైర్ పర్సన్.. వైస్ ఛైర్ పర్సన్ ల ఎన్నికను నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కొత్త పదవుల్ని చేపట్టిన కొత్త నాయకులు తెర మీదకు రానున్నారు.
అధికార పక్షానికి అనుకూలం గా లేని చోట్ల నిబంధనల్లో ఉన్న అవకాశాన్ని అసరా చేసుకొని.. ఆయా స్థానాల్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ శివారు లోని బడంగ్ పేట కార్పొరేషన్ లో టీఆర్ఎస్ కు బలం లేకున్నా.. ఎన్నికైన విపక్ష సభ్యుల్లో మూడింత రెండు వంతుల మంది విప్ ను ధిక్కరించటం ద్వారా పార్టీ ఫిరాయింపు వేటు పడకుండా పావులు కదిపారు. బడంగ్ పేటలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెబుతున్నారు.