కరోనా ఎఫెక్ట్: తెలంగాణ పోలీసుల బడితపూజ

Update: 2020-04-01 05:46 GMT
తెలంగాణలోని జనగాం జిల్లా చిల్పూర్ మండలంలో పోలీసుల చర్య వివాదాస్పదమైంది. కరోనాతో లాక్ డౌన్ వేళ ఇంటి బయట పేకాట ఆడుకుంటున్న ముగ్గురిని చావుబాదిన తీరు విమర్శల పాలైంది.  ముగ్గురుని మోకాళ్లపై కూర్చోబెట్టి వీపులు, వెనుకాల దారుణంగా కొట్టిన వైనంపై స్థానికులు మండిపడుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు అందరూ పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సామాజిక క్రమశిక్షణ పేరిట పోలీసులు అతిగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నారు. దీని ద్వారా పోలీసులు సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే పోలీసుల తీరు వివాదాస్పదమైంది. ఆంధ్రప్రదేశ్ లోని పెరవాలిలో ఓ ఎస్సై యువకుడిని దారుణంగా కొట్టాడు. దీనిపై దుమారం రేగడంతో ఉన్నతాధికారులు ఆ ఎస్సైని సస్పెండ్ చేశారు.

ప్రస్తుతం లాక్ డౌన్ వేళ పోలీసులు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి కారణంగా లేకుండా రోడ్డుపై సైకిళ్లతో వచ్చిన వారిని చావబాదుతున్నారు. రైతులు, గౌడ కులస్థులను కొడుతున్నారు. ప్రజలను వదలడం లేదు. వీరి లాఠీ ధాటికి ఎముకలు విరిగిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. Full ViewFull View
Tags:    

Similar News