మీటర్ ఫొటో తీస్తే కరెంట్ బిల్ రెడీ!

Update: 2020-04-23 17:00 GMT
కరోనా వైరస్ కారణంగా ప్రతీ నెల కరెంట్ బిల్లులు నమోదు చేసే విద్యుత్ సిబ్బంది రాకుండా పోయారు. కరోనా భయంతో ఇంటింటికి తిరిగితే వైరస్ సోకడం గ్యారెంటీ కావడంతో వారి సేవలను ఆపు చేయించారు. మరి కరెంట్ బిల్ ఎలా జనరేట్ చేయాలి? వినియోగదారులు ఎలా చెల్లించాలనే దానిపై తర్జనభర్జనలు నడిచాయి.

దీంతో తెలంగాణ ప్రభుత్వం బిల్ రీడింగ్ ను వాయిదా వేసి పోయిన మార్చి నెలలో ఎంత కట్టారో ఈ సంవత్సరం అంతే చెల్లించాలని అందరికీ బిల్స్ జనరేట్ చేసింది. మరి వచ్చే నెల వినియోగం భారీ పెరుగుతుంది. దీనిపై ఏం చేయాలని ఆలోచించిన విద్యుత్ సంస్థలు కొత్త ఐడియాను రూపొందించాయి. ఇందుకోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఆన్ లైన్ యాప్ విధానం అమల్లో ఉంది. అందరూ తమ ఇంటి మీటర్ ఫొటో తీసి వారే ఆన్ లైన్ లో అప్ లో లోడ్ చేయాలి. దీనికోసం ప్రత్యేక యాప్ లను విద్యుత్ సంస్థలు రూపొందించాయి. అలా అప్ లోడ్ చేయగానే మీటర్ రీడింగ్ ను బట్టి విద్యుత్ చార్జీలు వేస్తారు. దాన్ని కడితే సరిపోతుంది.

ఇప్పుడు ఢిల్లీ విద్యుత్ సంస్థల యాప్ ను తెలంగాణ ఉత్తర విద్యుత్ డిస్కం  అమల్లోకి తేవడానికి రెడీ అయ్యింది.  దీంతో విద్యుత్ సిబ్బంది ఇంటింటికి తిరిగే బాధ తోపాటు డబ్బులు ఆదా అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 30 రోజులకు ఒకసారి వినియోగదారులు ఫొటో తీసి పంపిస్తే వారికి ఫైన్ కూడా పడకుండా విద్యుత్ చార్జీ ఎంతో తెలుస్తుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇక విద్యుత్ సిబ్బంది వచ్చి కరెంట్ బిల్లు కొట్టే బాధే ఉండదు. ఎవరు బిల్ వారే కొట్టుకోవచ్చు.


Tags:    

Similar News